Sri Sathya Sai District AUTO Tragedy: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది అందులోనే సజీవదహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. ఉదయాన్నే వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైటెన్షన్ విద్యుత్ తీగలు కింద పడిపోతుండటాన్ని గమనించకుండా ఆటో డ్రైవర్‌ ముందుకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ వైర్లు ఆటోపై పడి ఒక్కసారి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి అందులోని ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఇప్పటివరకూ ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ప్రమాద విషయం తెలిసి స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.


ప్రమాద ఘటనపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యానారయణ, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పరిటాల శ్రీరామ్ ప్రభుత్వాన్ని కోరారు.


దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ :


గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీల మృతి విచారకరమని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా రాజ్‌భవన్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు. 


మృతులకు ప్రభుత్వ పరిహారం :


శ్రీసత్య సాయి జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.



Also Read: BJP National Executive Meet: మోదీ కోసం తెలంగాణ స్పెషల్ వంటకాలు.. ఏరి కోరి కరీంనగర్ యాదమ్మను పిలిపించిన బండి సంజయ్


Also Read: Pavitra Lokesh: నరేష్ తో సహజీవనం.. కృష్ణతో కలిసే.. మొదటి పెళ్లిపై పవిత్ర లోకేష్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.