BJP National Executive Meet: హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం స్పెషల్ ఫుడ్ మెనూ సిద్ధమైంది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ స్పెషల్ వంటకాలను రుచి చూడనున్నారు. వంటకాల విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఫుడ్ కమిటీ హెడ్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
తెలంగాణ వంటకాల తయారీ కోసం కరీంనగర్‌కి చెందిన యాదమ్మను ఎంపిక చేశారు. సమావేశాలు జరిగే రెండు రోజులు తెలంగాణ ప్రత్యేక వంటకాలు ఆమె వండి పెట్టనున్నారు. ఇందుకోసం యాదమ్మను బీజేపీ సమావేశాలు జరిగే నోవాటెల్ హోటల్‌కు ఈ నెల 29నే పిలిపించారు. యాదమ్మతో బండి సంజయ్ పలువురు బీజేపీ నేతలు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సమావేశాల్లో వండాల్సిన వంటకాలపై చర్చించారు. నోవాటెల్ చెఫ్‌లతో కలిసి వంటలు చేయాల్సిందిగా యాదమ్మను కోరారు.
సమావేశాల్లో రెండో రోజు పూర్తి శాఖాహార వంటకాలు చేయాలని యాదమ్మతో చెప్పారు. పుంటికూర పప్పు, బగార, దద్దోజనం, పులిహోర, సాంబారూ, గుత్తి వంకాయ, గంగవాయిలి కూర, మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, జొన్న రొట్టెలు, సకినాలు, గారెలు, సర్వపిండి, పెద్ద బూంది లడ్డు వంటకాలను యాదమ్మ ప్రిపేర్ చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు వంటల కోసం తనను కరీంనగర్ నుంచి నోవాటెల్‌కు పిలిపించడం పట్ల యాదమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సార్ తన వంట తింటారంటే అంతకన్నా సంతోషం ఏముంటుందని పేర్కొన్నారు.
కాగా,కరీంనగర్‌కి చెందిన యాదమ్మ 3 దశాబ్దాలుగా వంటల తయారీ రంగంలో ఉన్నారు. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ సహా పలువురు ప్రముఖుల కార్యక్రమాల్లో చాలాసార్లు వంటలు చేశారు. యాదమ్మ చేతి వంట అంటే చాలామంది ఇష్టపడుతారు.అందుకే ఏరి కోరి మరీ బీజేపీ నేతలు యాదమ్మను నోవాటెల్‌కు పిలిపించారు. మొత్తం మీద బీజేపీ జాతీయ నాయకత్వం అదిరిపోయే తెలంగాణ ఫుడ్‌ని రుచి చూడబోతున్నది.
Also Read: TS SSC Results 2022: నేడే పదో తరగతి ఫలితాలు... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
Also Read: Horoscope Today June 30th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు కుటుంబ వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.