BC Hostel Student died after Snake bite: విజయనగరం జిల్లా కురుపాం జ్యోతిబాపూలే బీసీ హాస్టల్‌లో పాము కలకలం రేపింది. అర్ధరాత్రి గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్ధులను ఓ కట్ల పాము కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి చనిపోగా.. మిగతా ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. కురుపాం ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయనగరం జిల్లా కురుపాం జ్యోతిబాపూలే బీసీ హాస్టల్‌ ప్రధాన రోడ్డు పక్కనే ఉంది. హాస్టల్‌ చుట్టుపక్కల ప్రాంతం అంతా అడవి ప్రాంతం మాదిరిలా ఉంటుంది. పెద్దపెద్ద చెట్లు, గుబురు పొదలు ఉంటాయి. దాంతో హాస్టల్‌లోకి అప్పుడప్పుడు పాములు వస్తుంటాయి. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి హాస్టల్‌లోకి ఓ నల్ల కట్ల పాము వచ్చింది. గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్ధులను కాటేసింది. పామును చూసిన విద్యార్థులు అందరూ గట్టిగా కేకలు వేశారు. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను గదిలోంచి బయటకు తీసుకెళ్లారు. 


హాస్టల్‌ సిబ్బంది ఆ పెద్ద కట్ల పామును చంపేశారు. అనంతరం ముగ్గురు విద్యార్ధులను కురుపాం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. రంజిత్ అనే స్టూడెంట్ మార్గ మధ్యంలోనే చనిపోయాడు. మరో ఇద్దరికి వైద్యులు సకాలంలో చికిత్స అందించారు.ప్రస్తుతం ఓ స్టూడెంట్ వెంటిలేటర్‌పై ఉండగా.. మరొకరు ఐసీయూలో ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. చనిపోయిన రంజిత్ పేరెంట్స్ శోక సముద్రంలో మునిగిపోయారు. 


విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి దైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 'ఈ ఘటన దురదృష్టకరం. రంజిత్ చనిపోవడం బాధించింది. కురుపాం ఏరియా ఆస్పత్రిలో మిగతా ఇద్దరు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం' అని డిప్యూటీ సీఎం చెప్పారు. 


Also Read: Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ స్పెషల్ 'సెంచరీ'.. ప్ర‌త్యేక మెమెంటో అందించిన రాహుల్ ద్రవిడ్‌ (వీడియో)!!


Also Read: Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook