Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ స్పెషల్ 'సెంచరీ'.. ప్ర‌త్యేక మెమెంటో అందించిన రాహుల్ ద్రవిడ్‌ (వీడియో)!!

Rahul Dravid gives 100th test match cap to Virat Kohli: విరాట్ కోహ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 100 టెస్టు మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న సంద‌ర్భంగా బీసీసీఐ అతడిని సత్కరించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 11:28 AM IST
  • భారత్‌, శ్రీలంక తొలి టెస్ట్‌
  • వందో టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా కోహ్లీకి ప్ర‌త్యేక మెమెంటో
  • మైదానంలోనే అనుష్క శ‌ర్మ
 Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ స్పెషల్ 'సెంచరీ'.. ప్ర‌త్యేక మెమెంటో అందించిన రాహుల్ ద్రవిడ్‌ (వీడియో)!!

Rahul Dravid gives 100th test match cap to Virat Kohli: మొహాలీ వేదికగా శ్రీ‌లంక‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైంది అన్న విషయం తెలిసిందే. మొహాలీ టెస్టు కోహ్లీకి 100వ అంత‌ర్జాతీయ టెస్టు మ్యాచ్. తొలి టెస్ట్ సందర్భంగా మైదానంలోకి అడుగుపెట్టగానే కోహ్లీ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన 12వ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక ప్రపంచంలో 71వ ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు.

విరాట్ కోహ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 100 టెస్టు మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న సంద‌ర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిని సత్కరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీకి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పెష‌ల్ మెమెంటోను అందించారు. అందులో 100వ టెస్టు మ్యాచ్ క్యాప్‌ ఉంది. ఇంకో షీల్డ్ కూడా బీసీసీఐ ప్రత్యేకంగా అందించింది. ఈ సందర్భంగా కోహ్లీని ప్రశంసిస్తూ ద్రవిడ్ మాట్లాడారు. ఈ స్పెష‌ల్ మెమెంటోకు కోహ్లీ అర్హుడ‌ని, భవిషత్తులో మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆయన కోరారు. 

మెమెంటో అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడాడుతూ... 'ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. చాలా సంతోషంగా ఉంది. నా భార్య పక్కనే ఉంది. నా అమ్మ, సోదరుడు కూడా ఉన్నాడు. అందరూ చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నారు. జట్టు స‌హ‌కారం లేకుండా ఇది సాధ్యం కాదు. బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు. 200 టెస్ట్ మ్యాచులు ఆడితే బాగుంటుంది. నా చిన్న‌నాటి హీరో రాహుల్ ద్రావిడ్ చేతుల మీదుగా 100వ టెస్ట్ మ్యాచ్ క్యాప్‌ అందుకోవడం గ‌ర్వంగా ఉంది' అని అన్నాడు.

రాహుల్ ద్రావిడ్ స్పెష‌ల్ మెమెంటోను అందిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీతో పాటు అత‌ని స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ కూడా మైదానంలోనే ఉన్నారు. ఆ సమయంలో అనుష్క చాలా ఆనందంగా ఉన్నారు. 100వ టెస్టు మ్యాచ్‌ను వీక్షించ‌డానికి అనుష్కతో పాటు కోహ్లీ కుటుంబ‌ స‌భ్యులు కూడా స్టేడియానికి వ‌చ్చారు. విరాట్ అమ్మ, సోదరుడు, చిన్ననాటి కోచ్ మ్యాచ్ చూడడానికి వచ్చారు. ప్రస్తుతం కోహ్లీ 99 టెస్టుల్లో 7962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 నాటౌట్. 

Also Read: Aadavallu Meeku Joharlu Twitter Review: ఆడవాళ్లు మీకు జోహార్లు రివ్యూ.. ఫాన్స్ ఏమంటున్నారంటే?

Also Read: Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News