సమ్మర్ ఎఫెక్ట్: పెట్రోల్ ఫుల్ ట్యాంక్ వద్దు ..హాఫ్ ట్యాంక్ ముద్దు
ఎండల తీవ్రత దృష్ట్యా వాహనదారులకు పెట్రో కంపెనీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ నింపితే ఎండల తీవ్రతకు ట్యాంక్ పేలే అవకాశలు ఎక్కవగా ఉన్నాయని ... సగం మాత్రమే నింపితే బెటరని సూచిస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ బంకుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వాహనాన్ని ఎండలో ఎక్కవ సేపు ఉంచడం కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశముందని..కాబట్టి సాధ్యమైనంత వరకు పార్కింగ్ నీడలో చేయాలని సూచిస్తున్నారు. ఎండల నేపథ్యంలో నాల్గో వంతు ఇంధనం గాలిలో ఆవిరై కలుస్తోందని ..కాబట్టి వాహనాన్ని సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉంచాలని.. కనీసం పార్కింగ్ నీడలో చేయాలని సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అయిల్ కంపెనీల హెచ్చరిక పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.