Tirumala Rush: శ్రీవారి దర్శనం కోసం జనం పోటెత్తుుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. దర్శనం కోసం 48 గంటల నిరీక్షణ తప్పడం లేదు అందుకే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు వేసవి ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు తిరుమల కొండ భక్తజనంతో నిండిపోయింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు వస్తుండటంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు వస్తుండటంతో మూడ్రోజులపాటు తిరుమల బ్రేక్ దర్శనాల్ని రద్దు చేసింది టీటీడీ. 


సాధారణంగా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు లేదా ప్రత్యేకమైన రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు. సాధారణరోజుల్లో భక్తుల తాకిడి పెద్దగా ఉండదు. కానీ ఏ ప్రత్యేక రోజుల్లేకుండానే తిరుమలలో గత వారం రోజుల్నించి భక్తులు పెద్దఎత్తున క్యూ కడుతున్నారు. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులతో తిరుమల కొండ జనసంద్రమైంది. భారీగా భక్తులు తరలిరావడంతో ఏర్పాట్లు కష్టమౌతున్నాయి. ఇవాళ అంటే మే 29వ తేదీ ఆదివారం కావడంతో వైకుంఠం కాంప్లెక్స్ అంతా కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఏకంగా 48 గంటల సమయం పడుతోందంటే..పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రెండ్రోజులపాటు క్యూ లైన్లోనే ఉండాల్సిన పరిస్థితి. 


వాస్తవానికి వేసవి సెలవుల్లో భక్తులు భారీగానే తరలివస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఊహించనిరీతిలో భక్తులు పోటెత్తుతున్నారు. వారం రోజుల్నించి ఇదే పరిస్థితి నెలకొందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. శనివారం నాడు లక్ష వరకూ భక్తులు తరలిరాగా..ఆదివారం అంటే ఇవాళ లక్షా 50 వేల వరకూ వచ్చుంటారని అంచనా. విద్యార్ధులకు వేసవి సెలవులు కావడం, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు అయిపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ప్రతి గంటకు క్యూలైన్లో 8 వేలమంది ప్రవేశిస్తుంటే..గంటకు 4 వేలమందికి మాత్రమే దర్శనం కలుగుతోంది. కంపార్ట్ మెంట్లు నిండిపోయి..భక్తులు బయటివరకూ క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. 


ఎండల వేడి, భక్తుల తాకిడి దృష్ట్యా అనారోగ్యంతో ఉన్నవాళ్లు, వయోవృద్ధులు కొద్దిరోజులు తిరుమల దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. మరో నాలుగైదు రోజులు ఇదే తాకిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీగా జనం క్యూలైన్లలో ఉండటంతో..తొక్కిసలాట జరగకుండా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


Also read: Gemology: కెరీర్‌లో విజయం సాధించాలంటే.. ఈ రత్నాలను ధరించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook