విజయవాడ కోవిడ్ ఆసుపత్రి ( vijayawada fire accident ) ప్రమాద ఘటన విచారణకు ఏపీ ప్రభుత్వానికి ( Ap Government ) మార్గం సుగమమైంది.  రమేష్ ఆసుపత్రిపై విచారణ చేయవచ్చంటూ దేశ అత్యున్నత  న్యాయస్థానం తీర్పునిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


విజయవాడలోని స్వర్ణప్యాలేస్ హోటల్ ( Swarna palace hotel ) లో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగి పదిమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  ఈ ఘటనలో పరారీలో ఉన్న డాక్టర్ రమేష్ ( Dr Ramesh ) , సీతారామ్మోహన్ రావులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దాంతో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme court ) ను ఆశ్రయించింది.  ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదన విన్పించారు. దర్యాప్తుపై ఏకపక్షంగా నిషేధం విధించడం సరికాదని...ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా పది మంది ప్రాణాలు కోల్పోయారని ముకుల్ రోహత్గీ వివరించారు.  రమేష్ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తుకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తిరిగి దర్యాప్తు కొనసాగే విధంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని న్యాయవాది వాదించారు.


పిటిషనర్‌ వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డాక్టర్ రమేష్ కేసులో విచారణ జరపవచ్చని తెలిపింది. అటు ప్రభుత్వ దర్యాప్తునకు డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఏపీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. Also read: AP Police: ప్రార్ధనాలయాల పరిరక్షణకు కీలక నిర్ణయాలు