AP Police: ప్రార్ధనాలయాల పరిరక్షణకు కీలక నిర్ణయాలు

ఏపీలో మత సామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం కొత్త చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా స్థలాల సర్వే, మ్యాపింగ్, సెక్యూరిటీ ఆడిట్ చేస్తోంది.

Last Updated : Sep 14, 2020, 08:35 AM IST
AP Police: ప్రార్ధనాలయాల పరిరక్షణకు కీలక నిర్ణయాలు

ఏపీలో( Ap ) మత సామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు ( Ap police ) యంత్రాంగం కొత్త చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా స్థలాల సర్వే, మ్యాపింగ్, సెక్యూరిటీ ఆడిట్ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో గత  వారం రోజుల్నించి మత సామరస్యానికి భంగం కల్గించే సంఘటనలు చోటుచేసుకున్న నేపధ్యంలో పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. పటిష్టమైన చర్యలు తీసుకోవల్సిందిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ( DGP Gautam sawang ) అధికార్లను ఆదేశించారు. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థనా మందిరాల సర్వే, మ్యాపింగ్, సెక్యూరిటీ ఆడిట్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు. జియో ట్యాగింగ్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, రథశాలల నిర్మాణం, భద్రతా సిబ్బంది నియామకం మొదలైనవి వెంటనే పూర్తి చేసేలా దేవదాయ, మైనార్టీ వ్యవహారాల శాఖల అధికారులతో చర్చించాలని చెప్పారు. అంతేకాకుండా దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద నిరంతరం ఇ–బీట్‌ ( E Beat at religious places ) ను ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు.  

పోలీస్‌ స్టేషన్ల పరిధిలో శాంతి కమిటీలను ( restore peace committee ) వారంలోగా పునరుద్ధరించాలన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేసేవారు, దొంగతనాల నేరచరిత్ర కలిగినవారిపై నిఘా పెట్టాలన్నారు. బయట నుంచి వచ్చే వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు పోలీసు యంత్రాంగం సదా సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మత సామరస్య పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. Also read: Kotamreddy Sridhar Reddy: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

Trending News