అందరూ అనుకున్నదే నిజమైంది. అమరావతి భూముల కుంభకోణం కేసులో ఏపీ హైకోర్టు ( Ap High court ) తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. హైకోర్టు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమరావతి భూముల కుంభకోణం కేసు ( Amaravati lands scam ) లో ఏసీబీ దర్యాప్తు ( ACB Investigation ) పై స్టే ఇవ్వడం, ఎఫ్ ఐ ఆర్ కాపీను ప్రచురించకూడదంటూ మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఏపీ హైకోర్టు అసాధారణ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పలువురు మేధావులు విస్మయం వ్యక్తం చేశారు. శాసనసభ వర్సెస్ న్యాయవ్యవస్థ వివాదానికి దారితీసింది. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఈ అంశంపై చర్చ జరిపారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే, ఇతర అంశాల్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme court ) లో సవాలు చేసింది. 


దీనిపై విచారణ జరిపిన దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో అసలు కేసు ఏంటని హైకోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తుపై స్టే ఇవ్వవద్దని అనేకసార్లు చెబుతూనే ఉన్నాం కదా అని గుర్తు చేసింది. చట్టం తన పని తాను చూసుకునేలా ఉండాలంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. 


తుళ్లూరు మాజీ తహశీల్దార్ సుధీర్ బాబు సహా పలువురిపై సీఐడీ దర్యాప్తు కేసును వారంలోగా తేల్చాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. కేసును మూడు వారాల తరువాత విచారణ చేపట్టడానికి వాయిదా వేసింది. వచ్చే వారం ఈ అంశంపై విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి మాజీ తహశీల్దార్‌ సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి అసైన్డ్  భూములను లాక్కున్న సంగతి తెలిసిందే. తమకు భూములు ఇవ్వకుంటే ల్యాండ్ పూలింగ్లో భూములు పోగొట్టుకోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారనేది ఆరోపణ. ల్యాండ్ పూలింగ్ పథకం అమలు కంటే ముందే పేదల భూముల బదలాయింపు, బెదిరింపులకు భయపడి పేద రైతులు తమ భూములను అమ్ముకున్నారనేది ఏపీ ప్రభుత్వ వాదన. Also read: CM KCR: ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంది.. వాదనలు వినిపించండి