CM KCR: ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంది.. వాదనలు వినిపించండి

నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే కయ్యం పెట్టుకుందని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.

Last Updated : Sep 30, 2020, 02:49 PM IST
CM KCR: ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంది.. వాదనలు వినిపించండి

Telangana- Andhra Pradesh Water Disputes: హైదరాబాద్: నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ఏపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ (AP) కావాలనే కయ్యం పెట్టుకుందని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్టోబరు 6న జరిగనున్న అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలని, మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలని అధికారులకు సూచించారు. అయితే.. అపెక్స్ కౌన్సిల్ (Apex Council) సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ బుధవారం ఆదేశించారు. Also read: Babri Masjid Demolition Verdict: బాబ్రీ కూల్చివేత ప్లాన్ కాదు.. అందరూ నిర్దోషులే

అదేవిధంగా.. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏడు సంవత్సరాలుగా అలసత్వాన్ని వహిస్తోందని.. దీనిపై తీవ్రంగా ప్రతిఘటించాలని సీఎం కోరారు. ఏడేళ్ల సమయం వచ్చినా ప్రధాన మంత్రికి రాసిన లేఖకు ఈ నాటికి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు పలుకు లేదని.. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నారు.. కానీ కేంద్రం ఏమీ చేయడం లేదని సీఎం అన్నారు.  ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్పూట్ యాక్ట్ 1956 సెక్షన్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ వేశైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారా నీటి కేటాయింపులు జరపాలని కోరాము. ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా, లేదంటే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరామన్నారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. Also read: Babri Masjid demolition case: నేడే బాబ్రీ తీర్పు

Trending News