Article 370 Verdict: సరిగ్గా నాలుగున్నరేళ్ల క్రితం జమ్ము కశ్మీర్ ఆర్టికల్ 70ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర నిర్ణయాన్ని సమర్ధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పు రానేవచ్చింది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలురించింది. ఆర్టికల్ 370 రద్దు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని తేల్చిచెప్పింది. పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో కలగజేసుకోలేమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయడం మంచిది కాదని, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్ని కేంద్రం నిర్వర్తించజాలదని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. దేశంలో విలీనమైనప్పుడు కశ్మీర్ ప్రాంతానికి సార్వభౌమాదికారం లేదని, తరువాత కూడా ఆ అధికారం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక వెసులుబాటు మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 


ఆర్టికల్ 370 ఏంటసలు


నాడు స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో చాలావరకూ సంస్థానాలు స్వతంత్రంగా ఉండేవి. అందులో ఒకటైన జమ్ము కశ్మీర్ భారతదేశంలో విలీనం సమయంలో అప్పటి సంస్థానాధిపతులతో కుదిరిన ఒప్పందం మేరకు ఆ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేర్చారు. 2019 ఆగస్టు 6న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఈ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. 


ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆర్టికల్ 370 రద్దు తాత్కాలికమా కాదా అనేది పరిశీలించారు. ఆర్టికల్ 370 తో శాసనసభ ద్వారా రాజ్యాంగ అసెంబ్లీకు ప్రత్యామ్నాయం చెల్లుబాటవుతుందా లేదా అనేది చర్చించారు. జమ్ము కశ్మీర్‌లో రాజ్యాంగ పరిషత్ లేకపోవడంతో రాష్ట్రపతి ఉత్తర్వు చెల్లుతుందా లేదా అనేది కూడా విశ్లేషించారు. 


Also read: Home lons: హోమ్ లోన్ కోసం చూస్తున్నారా, దేశంలో ఏ బ్యాంకు వడ్డీ రేటు ఎంత ఉంది, ఏ ఆఫర్లు ఉన్నాయి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook