Home lons: హోమ్ లోన్ తీసుకోవడం అనేది నిజంగా కష్టమే. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంకు వడ్డీ రేటు, ప్రోసెసింగ్ ఫీజు ఒక్కోలా ఉంటాయి. రుణం చెల్లింపు ప్రక్రియలో కూడా తేడా ఉంటుంది. అన్నింటినీ పరిశీలించి ఏది అత్యుత్తమో తేల్చుకోవడం అంత సులభం కాదు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అన్నీ ఇప్పుడు ఎక్కువగా హోమ్ లోన్లపై దృష్టి సారిస్తున్నాయి.
దేశంలోని దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు హోమ్ లోన్లపై పండుగ ఆఫర్ ప్రకటించాయి. అంటే ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే హోమ్ లోన్ ప్రత్యేక డిస్కౌంట్‌పై పొందవచ్చు. వడ్డీలో తగ్గుదల లేదా ప్రోసెసింగ్ ఫీజు మినహాయింపు ఇలా వివిధ రకాల ఆఫర్లు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం..మొదటిసారి హోమ్ లోన్ తీసుకునేవాళ్లు ముఖ్యంగా వడ్డీ రేట్లు, ప్రోసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ ఛార్జీలు, ఈఎంఐ మినహాయింపులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఏయే బ్యాంకుల్లో ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ హోమ్ లోన్ ఆఫర్‌లో భాగంగా అత్యల్పంగా 8.40 వడ్డీ నుంచి ఇంటి రుణాలు ప్రారంభమౌతాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు లేదా పూర్తయిన నిర్మాణాలపై ప్రత్యేక వడ్డీ రేటు ఉంటుంది. మహిళలకు ఇంకా ప్రత్యేక వడ్డీ ఉంటుంది. వేతన, వ్యాపార, ఫ్యామిలీ ఎక్కౌంట్ హోల్డర్లు అతి తక్కువ వడ్డీని పొందవచ్చు. అంతేకాకుండా అప్ ఫ్రంట్ ఫీజులో రాయితీ, జీరో ప్రాసెసింగ్ ఫీజు లబ్ది పొందవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజుతో ఇంటి రుణాలు ఆఫర్ చేస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఇది. కేవలం 8.35 శాతం వడ్డీతో ఇంటి రుణాలు ఆఫర్ చేస్తోంది. ప్రోసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంట్ అందిస్తుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ వడ్డీ రేటు 8.35 శాతానికి ఇంటి రుణాలు అందిస్తోంది. ప్రోసెసింగ్ ఫీజు లేదు. ప్రీపేమెంట్ ఛార్జీలు కూడా లేవు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇదొకటి. కేవలం 8.40 శాతం వడ్డీకే ఇంటి రుణాలు అందిస్తోంది. అంతేకాకుండా జీరో ప్రోసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, లీగల్ ఛార్జీలు, వాల్యుయేషన్ ఛార్జీలు ఆఫర్ చేస్తోంది.
ఇండస్ఇండ్ బ్యాంక్
ఇండస్ఇండ్ బ్యాంక్ 30 ఏళ్ల కాల వ్యవధికి ఎన్ఆర్ఐలకు ఇంటి రుణాలు అతి తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తోంది.
కెనరా బ్యాంకు
కెనరా బ్యాంకు కేవలం 8.40 శాతం వడ్డీకే ఇంటి రుణాలు అందిస్తోంది. ఫెస్టివ్ బోనస్ కింద జీరో ప్రోసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజు ఆఫర్ చేస్తోంది.
యాక్సిస్ బ్యాంకు
యాక్సిస్ బ్యాంక్ కొన్ని ఎంపిక చేసిన హోమ్ లోన్లపై 12 ఈఎంఐలు ఉచితంగా మినహాయింపు ఇస్తోంది.
యూనియన్ బ్యాంక్
యూనియన్ బ్యాంక్ తన కస్టమర్లకు జీరో ప్రోసెసింగ్, అతి తక్కవ వడ్డీకే ఇంటి రుణాలు ఇస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అతి తక్కువగా 8.30 శాతం వడ్డీకే ఇంటి రుణాలు అందించడమే కాకుండా జీరో ప్రీపేమెంట్ సదుపాయం కల్పిస్తోంది.
Also read: Article 370: జమ్ము కశ్మీర్ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook