Prudhvi Raj resigns to SVBC: హైకమాండ్ సీరియస్.. పృధ్వీరాజ్ రాజీనామా!
ఎస్వీబీసీ చైర్మన్, టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ రొమాంటిక్ సంభాషణ ఆడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
అమరావతి: టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఎస్వీబీసీ ఛానల్‌లో పనిచేసే మహిళా ఉద్యోగినితో చేసిన రొమాంటిక్ సంభాషణ ఆడియో సంచలనంగా మారడం పృధ్వీ పదవికి ఎసరు పెట్టింది. ధార్మిక సంస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ సర్కార్.. పృధ్వీని తక్షణమే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో పృధ్వీ తన పదవి నుంచి తప్పుకున్నారు.
Also Read: నటుడు పృధ్వీపై ఆరోపణలు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పృధ్వీని రాజీనామా చేయాలని సూచించారు. మరోవైపు విజిలెన్స్ విచారణకు వైవీ సుబ్బారెడ్డి ఆదేశించగా.. పోలీసులు విచారణ చేపట్టారు. కొందరు వ్యక్తులు తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని పృధ్వీ ఆరోపించారు. వైఎస్ జగన్‌కు సన్నిహితంగా ఉండటం, ఎస్వీబీసీ చైర్మన్ పదవి తనకు దక్కడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు నకిలీ ఆడియో టేపులు తయారుచేసి తనపై దుష్ప్రచారం చేశారని పృధ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: మహిళతో నటుడు పృథ్వీరాజ్ రొమాంటిక్ టాక్.. ఆడియో వైరల్!