Tarakaratna Wife Alekhya Reddy to Contest From Gudivada: నందమూరి తారకరత్న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న మొదటి రోజే గుండెపోటుకు గురై కుప్పకూలగా ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లడం, కొద్దిరోజులు చికిత్స తీసుకున్న తర్వాత కన్నుమూసిన సంగతి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే తారకరత్న సినిమాల్లో కలిసి రాకపోవడంతో ఇక రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని భావించారు. అందుకే అప్పటివరకు అంతగా యాక్టివ్గా లేకపోయినా టిడిపిలో చాలా యాక్టివ్ గా ఉండాలని నారా లోకేష్ పాదయాత్రలో కూడా పాల్గొనాలని ఆయన భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అనూహ్యంగా ఆయన మరణించడంతో ఆయన చివరి కోరిక తీర్చేందుకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆమె గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుందనే వార్తలు తెరమీద వస్తున్నాయి.  గుడివాడ నియోజకవర్గాన్ని ఒకప్పుడు ఎన్టీఆర్కు తర్వాత టిడిపికి కంచుకోటగా చెప్పుకునేవారు. తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ ఆరంగ్రేటం చేసి తర్వాత వైసీపీలోకి వెళ్లిన కొడాలి నాని గుడివాడను తన కంచుకోటగా మార్చుకున్నారు. గుడివాడలో తన మీద ఎవరు నిలబడినా గెలవరు అనే ధీమాతో ఆయన ఇక్కడ పోటీ చేసి గెలవాలని, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ సహా ఇతర టిడిపి నాయకులకు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూనే వస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా నారా లోకేష్, చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.


Also Read: Venu Swamy Comments: ఇక మిగిలింది శోభనం షూట్లే.. ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన కామెంట్లు!


అయితే కొడాలి నానిని 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఓడించాలని భావిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గుడివాడ నుంచి ఒక బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ ఇన్చార్జిగా రావి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తూ వస్తున్నారు. దాదాపు ఆయనని బరిలోకి దించుతారని భావిస్తున్న నేపథ్యంలో వెనిగళ్ళ రాము అనే ఒక ఎన్నారై రంగంలోకి దిగి పని చేస్తున్నారు. దీంతో రాము లేదా రావి వెంకటేశ్వరరావు ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.


అయితే ఇప్పుడు దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని టిడిపి అభ్యర్థిగా బరిలోకి దింపాలనే యోచనలో చంద్రబాబు అండ్ కో ఉన్నారని తెలుస్తోంది. నిజానికి 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తారకరత్న భావించారు. ఆయన చివరి కోరిక కూడా అదే అని చెబుతున్నారు. ఆయన చివరి ఓరిక తీర్చేందుకు సిద్ధమైన చంద్రబాబు అలేఖ్యను పోటీలోకి దించితే ఎలా ఉంటుందని యోచన చేసినట్లు తెలుస్తోంది. నందమూరి వారసుడి భార్యను బరిలోకి దింపితే కొడాలి నానికి గట్టిగా బ్రేకులు వేయవచ్చని బాబు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఈ విషయం మీద అటు జిల్లా వర్గాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది.


Also Read: Producer Chinnappa Thevar: ఒకప్పుడు 9 రూపాయల కూలీ.. కానీ చొక్కా వేసుకోకుండా 50 సినిమాలు నిర్మించాడు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook