Venu Swamy Comments: ఇక మిగిలింది శోభనం షూట్లే.. ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన కామెంట్లు!

Venu Swamy Sensational Comments: తాజాగా గర్భంతో ఉన్న ఒక మహిళ తన భర్తతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతుండగా దానిపై సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 6, 2023, 04:37 PM IST
Venu Swamy Comments: ఇక మిగిలింది శోభనం షూట్లే.. ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన కామెంట్లు!

Astrologer Venu Swamy Sensational Comments on Pregnancy Photoshoot: కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అని ఓ మహాకవి అంటే ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుంటున్న మోడరన్ యువత ప్రతి విషయంలోనూ ఫోటోషూట్లు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. మొన్నటికి మొన్న ఒక డ్రైనేజీలో దిగిన జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ డ్రైనేజీలో చేసుకుని వార్తల్లోకి ఎక్కగా మొన్ననే మరొక నటి డైవర్స్ అయిన తర్వాత డైవర్స్ కి సంబంధించిన ఫోటో షూట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది.

ఇక తాజాగా గర్భంతో ఉన్న ఒక మహిళ తన భర్తతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కూడా వైరల్ అవుతుంది. కేరళ రాష్ట్రానికి చెందిన వీడియోగా చెప్పబడుతున్న ఆ వీడియోలో గర్భవతి అయిన సదరు మహిళ తన భర్తతో డ్యాన్స్ చేస్తూ, ముద్దులాడుతూ కనిపించింది.

Also Read: Naga Chaitanya: ఆ టాపిక్ గురించి మాట్లాడి టైం వేస్ట్!.. నాగ చైతన్య అలా అన్నాడేంటి?

ఇక ఈ వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో పలువురు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియో మీద మండిపడ్డారు.  అదేమిటంటే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలో? మొన్న బురదలో వెడ్డింగ్ షూట్, నిన్న డైవర్స్ షూట్, ఈరోజు సీమంతం షూట్, ఇక మిగిలింది శోభనం షూట్లే అని అంటూ కామెంట్ చేశారు.

నిజానికి ఆయన దృష్టికి వెళ్లి ఉండకపోవచ్చు కానీ మొన్న ఈ మధ్య ఒక జంట పొరపాటున తమ శోభనం వీడియోని లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఘటన కూడా విపరీతంగా వైరల్ అయింది. అయితే ఆ జంట కావాలని చేశారో తెలియక పొరపాటున జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత నాలుక కరుచుకుని పోలీసులను ఆశ్రయించి ఆ వీడియోని డిలీట్ చేయించుకున్నారు. మొత్తం మీద టెక్నాలజీని వాడుకుంటూ వింత పోకడ్లకు వెళుతూ అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు మరి కొందరు.

Also Read: Trolls on Anasuya Bharadwaj: బూతులతో రెచ్చిపోయిన దేవరకొండ ఫాన్.. గోడ ఎక్కించిన అనసూయ భరద్వాజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News