Sandow MMA Chinnappa Thevar a Producer without Shirt: ఒంటి మీద చొక్కా కూడా వేసుకోకుండానే దాదాపు 50 సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు అందుకున్న ఒక తమిళ నిర్మాత గురించి తెలుసుకుందాం. ఆయన పేరు శాండో ఎంఎంఏ చిన్నప్ప దేవర్. ఆర్థిక ఇబ్బందుల వల్ల కేవలం 5వ క్లాసు వరకే చదివిన చిన్నప్ప దేవర్ తన కెరీర్ మొదట్లో 9 రూపాయలు జీతానికి ఒక మిల్లులో పని చేసేవాడు. తర్వాత సినిమాల మీద ఆసక్తితో మద్రాసు చేరి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల మీద అవగాహన పెంచుకున్నాడు.
ఎక్కువగా తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎంజీఆర్ కి అత్యంత ఆప్తుడిగా మారిపోయాడు. కొన్నాళ్లకు తానే సొంతంగా సినిమా తీయాలని ఎంజీఆర్ డేట్స్ అడిగితే వెంటనే ఆయన డేట్స్ ఇవ్వడంతో సినిమా నిర్మాతగా మారాడు చిన్నప్ప దేవర్. ఆ తర్వాత ఎంజీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో వరుసగా 16 సినిమాలు ఆయనతోనే చేశాడు. నిజానికి మొదటి సినిమా భానుమతి హీరోయిన్ గా నటింప చేసినా తర్వాత బి సరోజను మొట్టమొదటిసారి ఎంజీఆర్ పక్కన నటింపజేసిన ఘనత కూడా చిన్నపదేవర్ కే చెందుతుంది.
నిజానికి జయలలిత హీరోయిన్గా మారేంతవరకు ఎంజీఆర్ అన్ని సినిమాల్లో సరోజా దేవి హీరోయిన్ గా నటించేది. ఇక నిజానికి చిన్నపదేవర్ సుబ్రమణ్య స్వామి భక్తుడు అందుకే తనకు సినిమాల్లో వచ్చే లాభాలను నాలుగు భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని సుబ్రహ్మణ్య స్వామి గుళ్లకి దానం ఇచ్చేసేవాడు. రెండో భాగాన్ని తన కోసం ఉంచుకున్న మూడో భాగాన్ని తాను మొదటి సినిమా చేయడానికి ఆర్థిక సాయం చేసిన మిత్రులకు సమానంగా పంచేవాడు. ఇక నాలుగో భాగం మాత్రం పేదలకు పేద విద్యార్థులు చదువులకు విరాళం ఇస్తూ ఉండేవారు.
నిజానికి చాలా సినిమాల ఆయన నటులతో తీసినా సినిమాల్లో ఎక్కువగా జంతువులతోనే తీశారు. ఏనుగులు, పాములు, పులులు, ఆవులు, పొట్టేలు ఇలా జంతువులతో ఆయన ఎక్కువ సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అందుకు ఆయన చెప్పిన ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? జంతువులను స్నేహం చేసుకుని సినిమాల్లో నటింపజేస్తే చాలా మంచిది, ఎందుకంటే నా సినిమాలన్నీ అలా హిట్ అయినవే అనే వారు. ప్రధాన పాత్రలో ఇలా జంతువులను పెడితే కాల్ షీట్లు ఎగ్గొట్టవు, అలాగే అది కావాలి ఇది కావాలి అని కోరికలు కూడా కోరవు. మనం చెప్పినట్టు విని మనకి కావాల్సినట్లు నటిస్తాయని చెప్పేవారట.
Also Read: Trolls on Anasuya Bharadwaj: బూతులతో రెచ్చిపోయిన దేవరకొండ ఫాన్.. గోడ ఎక్కించిన అనసూయ భరద్వాజ్!
ఇక అప్పట్లో ఆయన ఏనుగు ప్రధాన పాత్రలో పెట్టి తెరకెక్కించిన హాతి మేరే సాతి అనే హిందీ సినిమా విదేశాల్లో కూడా ఘన విజయం సాధించింది. ఇక ఆయన ఆయా జంతువులను పలకరించే విధానం వాటితో ప్రేమగా మెలిగే విధానం చాలా ఆసక్తికరంగా ఉండేదట. ఆయన జంతువులను ఎలా చూసుకునే వారో ఉదాహరణగా గాయ్ అవుర్ గౌరీ అనే సినిమా కోసం నటింపజేసిన ఆవు గురించి ఎక్కువగా చెబుతూ ఉండేవారు. వాహినీ స్టూడియోలో ఈ ఆవు కోసం ఒక పెద్ద మండపం లాంటి గది కట్టించి అందులో ఉంచారట.
ఎండ, వాన రాకుండా దోమలు కుట్టకుండా పైన పెద్ద ఫ్యాన్ కూడా తయారు చేయించారట. ఎప్పటికప్పుడు ఆ మండపాన్ని శుభ్రం చేయించేందుకు ఇద్దరు పనివాళ్లను కూడా నియమించారు. ఇక దేవర్ ఉదయాన్నే వచ్చి ఆవుని పలకరించి మెడ అంతా దువ్వి దానితో మాట్లాడి వెళ్లేవారట. అంతేకాక ఇవాళ నీకు షూటింగ్ లేదు రా కన్నా హాయిగా విశ్రాంతి తీసుకోమని జో కొట్టి వెళ్లేవారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అసలు దేవర్ నిర్మాణ సంస్థకు బ్యాంకు ఖాతా లేదు, అంతా నగదు మీదే నడిచేది. నగదు ఇవ్వడం, రసీదు తీసుకోవడం ఒక రకమైన నమ్మకంతోనే ఆయన సినిమాలు చేశారు.
సినిమా కొన్న వాళ్ల దగ్గర కూడా డబ్బులే తీసుకునేవారు, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఏ రోజు ఒంటిమీద చొక్కా వేసుకో లేదు. అయితే ఒళ్ళంతా చందనం పూసుకునేవారట. అలా చందనం పూసుకునే మద్రాసు నుంచి బొంబాయి కూడా వెళ్లే వారట. ఇక అప్పట్లో హిందీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో హాథీ మేరే సాథీ అనే సినిమా నిర్మించాడు.
నిజానికి ఆయనకు అసలు హిందీ రాకపోయినా అప్పటివరకు ఎవరూ రాజేష్ ఖన్నాకు ఇవ్వనంత రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమా నిర్మించాడు. సూట్ కేసు నిన్న డబ్బు తీసుకెళ్లి ఈ హీరో టేబుల్ మీద పెట్టి సినిమా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని అగ్రిమెంట్ చేయించేచేసుకునేవాడు. డబ్బు అలా సింగిల్ పేమెంట్ తో ఇవ్వడంతో హిందీ హీరోలు మారు మాట్లాడకుండా అగ్రిమెంట్ చేసేవారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగులో పొట్టేలు పున్నమ్మ, అమ్మ ఎవరికైనా అమ్మ వంటి సినిమాలను ఆయన నిర్మించారు.. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా 50 సినిమాలు నిర్మించిన ఆయన ఒకే హీరోతో 16 సినిమాలను నిర్మించడం గమనార్హం.
Also Read: Naga Chaitanya: ఆ టాపిక్ గురించి మాట్లాడి టైం వేస్ట్!.. నాగ చైతన్య అలా అన్నాడేంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook