TDP MAHANADU: మహానాడు పేరు వినగానే దివంగత నేత ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.మహానాడు అంటే తెలుగుజాతికి పండుగ అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ప్రత్యేక ఉందని... టీడీపీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కార్యకర్తలు ఎదురించి నిలబడ్డారని చంద్రబాబు చెప్పారు. మనం అంతా కలిసి కట్టుగా కృషి చేస్తే భగవంతుడు ఆశీర్వదిస్తారని చంద్రబాబు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహానాడులో ప్రారంభ ఉపన్యాయం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. గడిచిన మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చిన  పార్టీ టీడీపీ అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం పరువుపోయే పరిస్థితులకు తీసుకువచ్చారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాదన్నారు చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని  పాలన సాగిస్తున్నారని.. తప్పులను ప్రశ్నించి వాళ్లను విరోధులుగా చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని చంద్రబాబు ద్వజమెత్తారు. కేసులు, లాఠీలకు భయడ్ ప్రసక్తే లేదన్నారు.


డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఉన్మాది చేతిలో పోలీసులు బలి కావొద్దన్నారు. తప్పుడు పనులు చేస్తే ఎవరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు పెంచారని చంద్రబాబు విమర్శించారు. ఆర్టీసీ , విద్యుత్, చెత్త.. ఇలా అన్నింటిపైనా భారీగా పన్నులు వేసి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. ఎవరైనా తప్పు తెలుసుకుంటే బాగుపడతారు..చెప్పింది వినకపోతే చరిత్ర హీనులవుతారని చంద్రబాబు తేల్చిచెప్పారు.


నిత్యావసరాలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. త్వరలోనే రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు. మోటార్లకు మీటర్లు పెడితే.. భవిష్యత్ లో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు.


READ ALSO: TDP MAHANADU: పొత్తులపై టీడీపీ మహానాడులో కీలక తీర్మానం? అమలాపురం అల్లర్లపై ప్రత్యేక చర్చ..!


READ ALSO: MLA BALAKRISHNA: ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ ఆందోళనతో ఉద్రిక్తత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook