Amaravati Posters Viral in IND Vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు పండగే. రెండు జట్లు కొదమ సింహాల్లా తలపడుతుంటే.. ఆ సమరాన్ని చూస్తూ  ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. టీ20 వరల్డ్ కప్‌లో గురువారం దయాదుల మధ్య పోరు మంచి కిక్ ఇచ్చింది. చివరివరకు నువ్వా-నేనా అన్నట్లు ఢీకొనగా.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది.  కింగ్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌ను వేలాది మంది స్టేడియంలో ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేయగా.. కోట్లాది మంది టీవీల్లో చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు కొంతమంది తెలుగువాళ్లు కూడా వెళ్లారు. అందులో ఓ టీడీపీ అభిమాని కూడా ఉన్నాడు.


అతను ఇండియా జెర్సీ ధరించి.. జై టీడీపీ అంటూ బ్యానర్ ప్రదర్శించాడు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. సేవ్ ఏపీ అని బ్యానర్‌లో రాసుకొచ్చాడు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు జై అమరావతి అంటూ నినాదాలు చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు. అమరావతి నినాదం కోట్లాది మందికి తెలిసేలా చేశాడని ప్రశంసిస్తున్నారు.


మరోవైపు వైసీపీ అభిమానులు మాత్రం మీరు మారారా..? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఎక్కడకు వెళ్లినా ఇంతేనా అంటూ తిడుతున్నారు.  


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా టాస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మసూద్, ఇఫ్తిఖార్ అహ్మద్ హాఫ్ సెంచరీలతో రాణించారు. అర్షదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు తీశారు.


అనంతరం కింగ్ కోహ్లి (82) మారథన్ ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. హార్ధిక్ పాండ్యా (40) కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో విరాట్ అద్భతమైన బ్యాటింగ్‌తో గెలిపించాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


Also Read: IND vs PAK Star Sports: స్టార్ స్పోర్ట్స్ కీలక నిర్ణయం.. సంబరపడిపోతున్న భారత్ ఫాన్స్


Also Read: Shiva Rajkumar GHOST : కన్నడ ఘోస్ట్.. శివరాజ్ కుమార్ పోస్టర్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook