Shiva Rajkumar GHOST : కన్నడ ఘోస్ట్.. శివరాజ్ కుమార్ పోస్టర్ వైరల్

Shiva Rajkumar GHOST కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా రాబోతోన్న ఘోస్ట్ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 04:44 PM IST
  • దీపావళి స్పెషల్ అప్డేట్లు
  • కన్నడ ఘోస్ట్ పోస్టర్ వైరల్
  • శివ రాజ్ కుమార్ లుక్ హైలెట్
Shiva Rajkumar GHOST : కన్నడ ఘోస్ట్.. శివరాజ్ కుమార్ పోస్టర్ వైరల్

Shiva Rajkumar GHOST : కన్నడలో ఘోస్ట్ సినిమా రాబోతోంది. తెలుగులో ఇదే పేరుతో నాగార్జున హీరోగా ఘోస్ట్ సినిమా వచ్చింది. అయితే ది ఘోస్ట్ అంటూ నాగార్జున సినిమా వచ్చింది. ఇప్పుడు కన్నడలో శివ రాజ్ కుమార్ హీరోగా ఘోస్ట్ సినిమా రాబోతోంది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో  రిలీజ్ చేస్తున్నారు. ‘బీర్బల్’ సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీని ఈ ఘోస్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

దీపావళి సందర్భంగా అన్ని భాషల్లో కొత్త సినిమాల అప్డేట్లు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఘోస్ట్ నుంచి కూడా అప్డేట్ వచ్చింది. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో బుల్లెట్ల వర్షం కురుస్తోన్నట్టుగా కనిపిస్తోంది. ఆ బులెట్ల వర్షాన్ని కురిపించింది కూడా శివ రాజ్ కుమార్ అన్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో శివ రాజ్ కుమార్ గన్ పట్టుకున్న స్టైల్, లుక్, ఆ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

అయితే ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఓ భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. ఆరు కోట్ల రూపాయాలతో అద్భుతమైన సెట్ వేశారని సమాచారాం. ఈ జైలు సెట్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. అక్కడ దాదాపు 24 రోజుల పాటు షూటింగ్ చేయబోతోన్నారట. నవంబర్ 10కి ఫస్ట్ షెడ్యుల్ పూర్తవుతుందట. డిసెంబర్లో రెండో షెడ్యూల్ మొదలు కానుందట. మొత్తానికి ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్‌ను వాడుతున్నారట. కేజీయఫ్‌తో ఫేమస్ అయిన ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకు పని చేస్తున్నాడు. అర్జున్ జన్య సంగీతాన్ని సమకూరుస్తున్నాడట.

శివ రాజ్ కుమార్ సోదరుడు పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణంతో అతని చివరి సినిమా అయిన జేమ్స్‌కు శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read : Free OTT Movies : ఫ్రీగా ఈ ఓటీటీల్లో సినిమాలు చూసేయండి.. ఎంజాయ్ పండుగో అంటే ఇదే  

Also Read : Janhvi Kapoor Diwali Pics : ఉబికివస్తోన్న జాన్వీ కపూర్ అందాలు.. తెరిచిపెట్టేసిన కియారా అద్వానీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News