India vs Pakistan T20 World Cup 2022 full match streaming at Star Sports: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అధ్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో.. భారత అభిమానులు ఒకరోజు ముందే 'దీపావళి' పండగ చేసుకున్నారు. చివరి బంతి వరకు ఫలితం లేకపోవడంతో.. వ్యూవర్ షిప్ పరంగా అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ రికార్డులు సృష్టించింది.
చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ దెబ్బకు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కోటి 80 లక్షల మందికి పైగా ఫాన్స్ ఇండో-పాక్ మ్యాచ్‌ను తిలకించారు. ఇప్పటివరకు స్టార్ స్పోర్ట్స్ వ్యూవర్‌షిప్‌లో ఇదే అత్యధిక రికార్డ్. యూఏఈ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022లో దాయాదులు తలపడినప్పుడు కోటి 30 లక్షల వ్యూస్ వచ్చాయి. తాజాగా టీ20 ప్రపంచకప్ 2022లో ఆ రికార్డు బద్దలు అయింది. మ్యాచ్ రసవత్తరంగా సాగడమే ఇందుకు కారణం.
పలు కారణాల వల్ల భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడని ఫాన్స్ చాలా నిరాశ చెంది ఉంటారు. కొందరు పూర్తి మ్యాచ్ చూడని వారుంటారు. విరాట్ కోహ్లీ విన్యాసాలను మరోసారి ఆస్వాదించాలనే ఫాన్స్ కూడా ఉన్నారు. అలాంటి వారి కోసమే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ పునఃప్రసారం చేయనుంది. సోమవారం రాత్రి 8 గంటలకు స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది. స్టార్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ 'బాల్ టూ బాల్' మ్యాచ్‌ను రీటెలికాస్ట్ చేయనుంది. విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెల్‌బోర్న్ మైదానంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (51; 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాన్ మసూద్ (52 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో అర్శ్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విశ్వరూపం చూపించగా.. హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవుఫ్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read: వైరల్ వీడియో.. ఈ పెద్దాయన టపాకాయలు ఎలా కాల్చుతున్నాడో చూడండి! నవ్వు ఆపుకోలేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి