Sabbam Hari passed away due to COVID-19: విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇక లేరు. ఏప్రిల్ 15వ తేదీన కరోనావైరస్ బారిన పడిన సబ్బం హరి విశాఖపట్నంలోని (Vizag) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. అంతకంటే ముందుగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 26నే సబ్బం హరి ఆరోగ్యం మరింత క్షీణించినట్టు వార్తలొచ్చాయి. అప్పటి నుంచే సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు క్షీణిస్తూ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. అంతకంటే పది రోజుల ముందే సబ్బం హరికి కరోనా సోకగా వైద్యుల సూచనల మేరకు ఇంటివద్దే ఐసోలేషన్‌‌లో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : India Corona Crisis: 2 కోట్లకు చేరువలో కరోనా కేసులు, ఆరవ రోజు కూడా 3 వేల మరణాలు


అయితే ఇంటివద్ద ఉండి చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన ఆక్సీజన్ లెవెల్స్ (Oxygen levels) పడిపోవడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించే ప్రయత్నం చేసినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. సబ్బం హరి మృతి (Sabbam Hari's death news) పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook