Ayyanna patrudu: నర్సీపట్నంలో ఉద్రిక్తత...నడిరోడ్డుపై అయ్యన్న ధర్నా..
విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల వైఖరికి నిరసనగా నడిరోడ్డుపైనే తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ధర్నాకు దిగారు.
TDP Leaders protest in Narsipatnam: విశాఖ జిల్లా నర్సీపట్నం(Narsipatnam)లో తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyanna patrudu) నడిరోడ్డు పై ధర్నాకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం(TDP Leaders protest)లో ఆందోళన చేపట్టారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నివాసం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి ఫిర్యాదు చేయాలని తెదేపా శ్రేణులు నిర్ణయించారు. ర్యాలీకి అనుమతించని పోలీసులు మార్గ మధ్యలోనే తెదేపా శ్రేణులను అడ్డుకున్నారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపైనే ధర్నా(Dhrna)కు దిగారు. ఈక్రమంలో పోలీసులు, తెదేపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మహిళా కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
Also Read: Visakhapatnam: 'అమెజాన్' ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయం..నలుగురు అరెస్ట్..
ఎంతసేపైనా సరే రోడ్డుపైనే బైఠాయించి.. పోలీసు స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు చేసి తీరుతామని అయ్యన్న స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమన్నారు. పోలీసుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు, పలువురు సీనియర్ నేతలు నిరసనలో పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook