TDP MLA Payyavula Keshav Corona: ఏపీలో కరోనా (Covid-19) విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు (TDP MLA Payyavula Keshav) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పయ్యావుల కేశవ్‌కు.. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచలన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి.. ఆయన చికిత్స తీసుకుంటున్నారు. తనను ఇటీవల కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గతంలోనూ కేశవ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kodali Nani: మంత్రి కొడాలి నానికి కొవిడ్​- హైదరాబాద్​ ఏఐజీ హాస్పిటల్​లో చేరిక


ఇటీవల ఆంధ్ర ప్రదేశ్​ పౌర సరఫరాలు, వినియోగదారు వ్యవహారాల మంత్రి కొడాలి నాని కొవిడ్ బారిన పడ్డారు.  ఆయన హైదరాబాద్​లోని (Kodali Nani Tested Corona Positive) ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ నేత వంగవీటి రాధా కూడా కరోనా బారిన (Vangaveeti Radha tested Corona Positive) పడ్డారు. ఆయన కూడా హైదరాబాద్​ ఏఐజీలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇద్దరి నేతల ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తెలంగాణలో మంత్రి జగదీశ్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలకు కరోనా సోకింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook