Kodali Nani: దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రాజకీయ నేతలు, ప్రముఖులు పెద్ద ఎత్తన కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాలు, వినియోగదారు వ్యవహారాల మంత్రి కొడాలని నానికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని (Kodali Nani Tested Corona Positive) ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కొడాలి నాని ఆరోగ్యం పట్ల ప్రస్తుతానికి ఏ ఆందోళన అవసరం లేదని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు టీడీపీ నేత వంగవీటి రాధా కూడా కరోనా బారిన (Vangaveeti Radha tested Corona Positive) పడ్డారు. ఆయన కూడా హైదరాబాద్ ఏఐజీలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
కరోనా సోకిన రాజకీయ నాయకులు వీరే..
ఇటీవలి కాలంలో పలువురు రాజకీయనాయకులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు కరోనా బారిన (Corona infected politicians) పడ్డారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా తాజాగా కొవిడ్ పాజిటివ్‌గా (Nitin Gadkari tested Corona Positive) తేలింది.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సహా పలువురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఇందులో కొంత మందికి కొవిడ్ సోకడం రెండవ సారి కావడం గమనార్హం. కరోనా సోకినప్పటికీ చాలా మంది ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు (Corona infected Chief Ministers) స్వయంగా ప్రకటించారు.
Also read: విషాదం... కెనాల్‌లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి కారు.. ఇద్దరు మృతి
Also read: No illegal mining : అక్కడ ఎలాంటి మైనింగ్ జరగట్లేదు.. అదంతా అప్పుడు జరిగిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook