హోదా నెరవేర్చే బాధ్యత బీజేపీది.. సాధించే బాధ్యత వైసీపీదే -సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
సభలో హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ పోరాటాన్ని గుర్తు చేస్తూ ..ఇదే అంశంపై బీజేపీని విమర్శిస్తూ ... ఆ బాధ్యతను వైసీపీపై నెట్టేసిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
లోక్ సభలో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. గత ఐదేళ్లకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం టీడీపీ తీవ్రంగా పోరాడిందని గుర్తు చేస్తూ....హోదా తీసుకురాలేదనే ఏకైక కారణంతో తమ పార్టీని ప్రజలు ఓడించారని పేర్కొన్నారు. మరోవైపు హోదాపై మాట తప్పిన కారణంగానే రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హోదా తీసుకొస్తారనే ఏకైక కారణంతో ప్రజలు వైసీపీని గెలిపించారని పేర్కొన్న గల్లా జయ్ దేవ్.... హోదా సాధించాలన్న కోరిక ఏపీ ప్రజల్లో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు.
హోదా బాధ్యత జగన్ దే...
హోదా అనేది 5 కోట్ల ఆంధ్రుల ఆంకాంక్ష అని...హోదాను కేంద్రం తిరస్కరించడమంటే..తెలుగు ప్రజల ఆంక్షలపై నీళ్లు చల్లినట్లేనన్నారు. హోదా తీసుకొస్తానని..ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జనాలకు జగన్ విజ్ఞప్తి చేశారు. హోదా తీసుకొస్తారనే ఏకైక కారణంతో ఏపీ ప్రజలు వైసీపీకి ఓట్లేసి గెలిపించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఒకవైపు హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెబుతోంది... కానీ హోదా తెస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఇప్పుడు హోదా తెచ్చే బాధ్యత జగన్ పార్టీపైనే ఉందని ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు.