Kesineni Nani, Galla Jayadev: టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ బీజేపీలో చేరుతున్నారా ?
TDP MPs Kesineni Nani, Galla Jayadev to join BJP ?: ఇప్పటికే ఈ ఇద్దరు బీజేపికి చెందిన కీలక నేతలతో ఢిల్లీలో మంతనాలు జరిపారని, త్వరలోనే తెలుగు దేశం పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారనేది ఆ ప్రచారం సారాంశం. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (TDP MP Rammohan Naidu) ఒక్కరు మినహా.. మిగతా పార్లమెంటరీ పార్టీ మొత్తం బీజేపీలో విలీనమైనట్టే అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
TDP MPs Kesineni Nani, Galla Jayadev to join BJP ?: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగలనుందా ? టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ బీజేపీలో చేరబోతున్నారా ? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా టీడీపీకి కీలకంగా వ్యవహరిస్తున్న కేశినేని నాని, గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేతల్లో ఒకరైన గల్లా జయదేవ్.. ఈ ఇద్దరూ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు ఓ ప్రచారం ఊపందుకుంది.
Chandrababu naidu's photo: చంద్రబాబు నాయుడు ఫోటోను పక్కకు పెట్టారా ?
ఇప్పటికే ఈ ఇద్దరు బీజేపికి చెందిన కీలక నేతలతో ఢిల్లీలో మంతనాలు జరిపారని, త్వరలోనే తెలుగు దేశం పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారనేది ఆ ప్రచారం సారాంశం. ఇన్నాళ్లపాటు తన కార్యాలయంలో చంద్రబాబు నాయుడితో దిగిన ఫోటోను ప్రముఖంగా కనిపించేలా ఏర్పాటు చేసిన కేశినేని నాని తాజాగా ఆ ఫోటోను తొలగించి ఆ స్థానంలో రతన్ టాటాతో కలిసి తీసుకున్న ఫోటోను ఏర్పాటు చేశారట. ఎలాగూ పార్టీని వీడి బీజేపీలో చేరే (Kesineni Nani to join BJP) ఉద్దేశంతో ఉన్నారు కనుకే ఇలా చంద్రబాబు ఫోటోను ఇక పక్కకు పెట్టించారనే టాక్ వినిపిస్తోంది.
అంతేకాకుండా తన లోక్‌సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ కీలక నేతల ఫోటోలను కూడా తొలగించి.. ఆ స్థానంలో తాను సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలను పెట్టించారట. సరిగ్గా ఇలాంటి పరిణామాలే కేశినేని నాని చంద్రబాబుకు గుడ్ బై చెప్పేందుకు (Kesineni Nani to quit TDP ?) రెడీ అయిపోయారనేందుకు నిదర్శనం అంటూ ఆ ప్రచారంలో పేర్కొంటున్నారు.
Also read : Kodali Nani : చంద్రబాబుపై ఫైర్ అయిన కొడాలి నాని
Galla Jayadev - గల్లా జయదేవ్ ఎందుకంటే..?
ఇదిలావుంటే, మరోవైపు గల్లా జయదేవ్ విషయానికొస్తే.. గల్లా జయదేవ్ కి అమర రాజా బ్యాటరీస్ పేరుతో పెద్ద బ్యాటరీస్ కంపెనీ ఉంది. ఇటీవల కాలంలో అమర రాజా బ్యాటరీస్ కంపెనీపై (Amara Raja Batteries) దర్యాప్తు పేరుతో పలు లీగల్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సహాయం ఎంతైనా అవసరం అనే ఉద్దేశంతోనే గల్లా జయదేవ్ కూడా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారనే (Galla Jayadev to join BJP ?) ప్రచారం జరుగుతోంది.
TDP parliamentary party - టీడీపీ పార్లమెంట్ పక్షం సంగతేంటి ?
ఇదే కానీ నిజమైతే ఇప్పటికే టీడీపీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపిలో చేరినట్టే ప్రస్తుతానికి టీడీపీకి ఉన్న ముగ్గురు లోక్ సభ ఎంపీల్లో ఇద్దరు పార్టీని వీడటం పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఇద్దరు పార్టీని వీడినట్టయితే... శ్రీకాకుళం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (TDP MP Rammohan Naidu) ఒక్కరు మినహా.. మిగతా పార్లమెంటరీ పార్టీ మొత్తం బీజేపీలో విలీనమైనట్టే అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
Also read : AP Power Crisis: ఏపీలో విద్యుత్ సంక్షోభం ఉందా లేదా, విద్యుత్ శాఖ ఏం చెబుతోంది, ఏది వాస్తవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook