Chandrababu Naidu on CM Jagan: కుప్పం నా సొంత ఊరు అని.. కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి గుడిపల్లి గుండెకాయ అని.. తన లాంటి వ్యక్తికే రక్షణ లేదు సామాన్యులకు రక్షణ కరువైందన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందని.. ఇక 100 రోజులే సమయం ఉందన్నారు. పోలీసులకు తానే దిక్కు అని.. ఐదేళ్లలో పోలీసులకు ఏమీ చేయలేదన్నారు. గురువారం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ప్రభుత్వం పని అయిపోయిందని.. ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్‌కు వచ్చేసిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"35‌ సంవత్సరాలుగా కుప్పం ప్రజలు ఆదరిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికే కుప్పానికి వచ్చా. కుప్పం నియోజకవర్గంలో పది లక్షల లీటర్ల పాలు వచ్చేలా చర్యలు తీసుకుంటా.. కచ్చితంగా సూపర్ సిక్స్ పథకలాను అమలు చేస్తాం.. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మహిళలకు ప్రోత్సాహం అందిస్తా.. డీఎస్సీ ఇవ్వలేదు.. నిరుద్యోగం పెరిగిపోయింది.. యువతకు పెద్దపీట వేస్తాం.. 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. వంద రోజులు మనకోసం పనిచేస్తే మంచిరోజులు వస్తాయి.. 


ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి‌ వచ్చిన వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతే.. దేవుని భూములను సైతం అమ్మేస్తున్నారు.. హంద్రీనీవా నీరు శ్రీశైలం నుంచి కుప్పానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను.. ఈ ప్రాజెక్ట్‌ను నీరుగార్చారు.. రైతులకు సంపద సృష్టించే పథకాలు తీసుకువస్తా.. రైతులను పూర్తిగా దగా చేశారు.. రైతులకు సంవత్సరానికి 20 వేలు ఇచ్చేలా ప్రణాలికలు రచించా.. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందులకు‌ గురిచేస్తున్నారు.. బీసీలను అవమానిస్తే అట్రాసిటీ చట్టం తీసుకువస్తా.. బీసీలకు అన్ని రకాలుగా అండదండలు అందజేస్తాం..


మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నారు... 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేస్తున్నారు.. నిత్యవసర వస్తువులు, కరెంటు, పెట్రోల్ రేట్లు పెంచేస్తున్నారు.. సుపరిపాలన అందజేస్తాను.. సంపద సృష్టించి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటా... అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు రోడ్డుపైకి వచ్చారు.. నిరుపేద కుటుంబాలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వారి ఆదాయం పెంచుతా.." అని చంద్రబాబు నాయుడు అన్నారు.


కుప్పం‌ నియోజకవర్గానికి ఇండస్ట్రీస్ తీసుకువచ్చి నిరుద్యోగ సమస్య తీరుస్తానని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో‌ ఒక్క సిమెంట్ రోడ్డు వేయలేదన్నారు. వెంకటాపురంలో జడ్పీటీసీ కృష్ణమూర్తి రైతులపై ప్రతాపం చూపాడని.. ఆంబోతులను అణచివేస్తాన్నారు. రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు దొంగ పనులు నేర్పింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు. ఇసుకలో దోపిడీ, మద్యంలో దోపిడీ, భూములు దోపిడీ, గ్రానైట్‌లో దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి ఒక గజదొంగ.. అరాచకశక్తులను అంతం చేయాలంటే ఇంటికొకరు ముందుకురావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.


Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter