TDP Senior leader Garapati Sambasiva Rao passes away: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గారపాటి సాంబశివరావు (75) అనారోగ్యంతో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో బుధవారం (ఫిబ్రవరి 2) తుది శ్వాస విడిచారు. సాంబశివరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'తెలుగుదేశం సీనియర్ నాయకులు,మాజీ మంత్రి గారపాటి సాంబశివరావుగారి మరణం విచారకరం. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివరావుగారు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడా పనిచేసి తనదైన ముద్రవేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.



సాంబశివరావు మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విచారం వ్యక్తం చేశారు. 'టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మృతి బాధాకరం. ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి చిరస్మరణీయులుగా నిలిచారు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.' అని పేర్కొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా సాంబశివరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా, అనారోగ్య కారణాలతో సాంబశివరావు కొన్నేళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఆయన కన్నుమూశారు. 


Also Read: Jinnah Tower Issue: జిన్నా టవర్‌‌ రంగు మార్చేశారు.. జెండా ఆవిష్కరణతో బీజేపీ ప్లాన్‌కు చెక్‌ అట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook