Guntur Jinnah Tower: గుంటూరులో ఉన్న జిన్నా టవర్‌కు పేరు మార్చాలంటూ బీజేపీ గత కొద్ది రోజులుగా పట్టుబట్టింది. స్వాతంత్రానికి పూర్వమే నిర్మించిన ఈ చారిత్రక కట్టడాన్ని కూల్చి వేస్తామంటూ కూడా బీజేపీ హెచ్చరిస్తూ వస్తోంది.
జిన్నా టవర్‌పై (Jinnah Tower) వివాదం చెలరేగంతో ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. దాని చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా జిన్నా టవర్ విషయంలో అధికార యంత్రాంగం కాస్త తెలివిగా వ్యవహరించింది. జిన్నా టవర్ విషయంలో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేలా చేశారు అధికారులు.
జిన్నా టవర్‌కు జాతీయ జెండా రంగులు వేశారు. అంతేకాదు ఈ నెల 3వ తేదీ అంటే రేపు జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నామంటూ మేయర్ కావటి మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu) పేర్కొన్నారు.
బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి (Jinnah Tower Controversy) స్వస్తి చెప్పాలంటూ ముస్లిం పెద్దలతో కలసి తాము ఒక నిర్ణయం తీసుకున్నామంటూ మనోహర్ నాయుడు (Guntur Mayor) తెలిపారు. ఇక జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా జిన్నా టవర్ పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోతుందని అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు జిన్నా టవర్‌కు ఆ పేరు మార్చే ప్రసక్తే లేదంటూ తమ అధిష్టానం తీర్మానం చేసిందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక జిన్నా టవర్‌కు జాతీయ జెండా రంగులు వేయడంతో పాటు అక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టనుండడంతో బీజేపీ (BJP) వ్యూహానికి చెక్ పెట్టామని వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు భావిస్తున్నారట.
ఇక జిన్నా టవర్ విషయానికి వస్తే... గుంటూరుకు వచ్చిన జిన్నా రాకకు గుర్తుగా ఈ జిన్నా టవర్‌ను అక్కడ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి ముందు మహమ్మద్ అలీ జిన్నా గుంటూరులో ఒక బహిరంగ సభకు రావాల్సి ఉంది. అయితే చివరి క్షణాల్ల జిన్నా పర్యటన రద్దు అయింది. దీంతో గుంటూరులో జిన్నా టవర్‌ను (Jinnah Tower) ఏర్పాటు చేశారు. అలా అది జిన్నా టవర్ సెంటర్‌గా పేరు గాంచింది.
Also Read: Revanth Reddy press meet: మోదీ, నిర్మలా సీతారామన్‌పై కేసీఆర్ బూతులా.. సిగ్గు సిగ్గు
Also Read: Andhra Pradesh Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే- కేంద్ర సహాయమంత్రి పార్లమెంట్ లో ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook