MLC Bachula Arjunudu Passed Away:  తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా విజయవాడలోకి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు మరణంతో గన్నవరంతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన మచిలీపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి.. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అనంతరం తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2017లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. 


ఆయనకు ఈ నెల 25 వరకు ఎమ్మెల్సీ పదవి ఉంది. 30 రోజుల నుంచి విజయవాడ రమేష్ హాస్పిటల్‌లో కోమాలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయన స్వగ్రామం మచిలీపట్నంకు పార్దివదేహం తరలిస్తారు. రమేష్ ఆసుపత్రికి బంధువులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకుంటున్నారు.


బచ్చుల అర్జునుడు మరణం పట్ల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. 'నిజాయితీ నిబద్దత కల్గిన నేత బచ్చుల అర్జునుడు. ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎనలేనిది. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. అర్జునుడు పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేవారు. పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా అర్జునుడు ముందే ఉండేవారు. ఎమ్మెల్సీగా మండలిలో వైసీపీ మంత్రుల అబద్దాల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. అర్జునుడి మృతితో టీడీపీ ఒక సమర్ధవంతమైన నేతని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్దిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి..' అని అచ్చెన్నాయుడు అన్నారు. 


Also Read: Bandi Sanjay: వాళ్లు నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా పనికిరారు.. బండి సంజయ్ సెటైర్లు  


Also Read: Tax Saving Tips: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి గమనిక.. పన్ను ఇలా ఆదా చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి