Telangana AP high courts to get new chief justices soon : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. దేశంలోని పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు (high court chief justice), న్యాయమూర్తుల బదిలీపై కొలీజియం ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ఛత్తీస్‌గడ్‌ హైకోర్టుకు బదిలీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకేసారి 8 హైకోర్టులకు కొత్త ప్రధానన్యాయమూర్తులను నియమించాలని, 5 హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌లతో పాటు వివిధ హైకోర్టులకు చెందిన 28మంది న్యాయమూర్తులను బదిలీచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (Supreme court chief justice NV Ramana) సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసింది.


Also Read : Narendra Modi: ఉగ్రవాదం పెరగడానికి ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలే కారణం, ఎస్‌సీవో సదస్సులో


తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ


తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్‌ హిమాకోహ్లీ సుప్రీంకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానాన్ని కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో (Justice Satish Chandra Sharma) భర్తీ చేయాలని కొలీజియం సూచించింది. అలాగే అలహాబాద్‌, కలకత్తా, కర్ణాటక, మేఘాలయ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టులకు కూడా కొత్త సీజేల పేర్లను సిఫారసు చేసింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


క్రిమినల్‌ కేసుల వాదనలో ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు మంచి పేరు


ఇక ఏపీ హైకోర్టు సీజేగా రానున్న జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా (Justice Prashant Kumar Mishra) ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్‌ లోని రాయగడ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్‌ యూనివర్సిటీలో బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో (High Court) ఆయన ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్‌ కేసుల వాదనలో ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు మంచి పేరుంది. అలాగే ఆయన ఛత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


Also Read : Artificial Kidney: త్వరలో మార్కెట్‌లో కృత్రిమ కిడ్నీ, ఎలా పనిచేస్తుందో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook