తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆ రాష్ట్ర మాజీ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కేడర్ రద్దైంది. తిరిగి పాతగూటికి అంటే ఏపీ కేడర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడలో తక్షణం రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర విభజన తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్ కేటాయించింది. కానీ ఏపీకు వెళ్లడం ఇష్టం లేక..క్యాట్‌ను ఆశ్రయించారు సోమేష్ కుమార్. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని కొట్టివేసిన క్యాట్..సోమేష్ కుమార్‌కు తెలంగాణ కేడర్ కేటాయించింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం తిరిగి హైకోర్టులో క్యాట్ ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేయడంతో హైకోర్టు క్యాట్ తీర్పును కొట్టివేసింది. తిరిగి ఏపీ కేడర్ కేటాయించడమే కాకుండా తక్షణం రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. 


తెలంగాణ హైకోర్టు ఇలా ఆదేశించిందో లేదో అటు డీవోపీటీ సోమేష్ కుమార్‌ను తక్షణం తెలంగాణ నుంచి రిలీవ్ చేసి..ఏపీకు రిపోర్ట్ చేయమని ఆదేశించింది. దాంతో సోమేష్ కుమార్ విజయవాడ చేరుకున్నారు. ముందుగా సెక్రటేరియట్‌లో ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించే ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని సోమేష్ కుమార్ తెలిపారు. 


ప్రస్తుతం అందరికంటే సీనియర్ అధికారిగా ఉన్న సోమేష్ కుమార్‌కు ఏ బాధ్యత అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది. 15 మంది సీనియర్ల పోస్టింగుల్లో మార్పులు చేర్పులు జరగవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో వీఆర్ఎస్ తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. సోమేష్ కుమార్ మాత్రం వీఆర్ఎస్ పై నిర్ణయం తీసుకోలేదని..కుటుంబసభ్యులతో చర్చించాలన్నారు.


Also read: Ap cm Ys jagan: ఉద్యోగులకు శుభవార్త, సంక్రాంతికి పెండింగ్ డీఏ విడుదలకు వైఎస్ జగన్ హామీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook