TS High Court: నర్శాపురం మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్యకు ఇంకా ప్రచార యావ తగ్గలేదు. గుర్తొచ్చినప్పుడల్లా రాజకీయ ప్రకటనలు చేస్తూ నేనున్నాననే ఉనికి చాటుకుంటుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్థుల కేసుపై పిల్ వేసి చివాట్లు తిన్నారు. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నర్శాపురం ఎంపీగా పనిచేసిన చేగొండి హరిరామజోగయ్య గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో ఏపీ హోంమంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం 86 ఏళ్ల వయస్సులో ఉన్న చేగొండి హరిరామజోగయ్య చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల అప్పుడప్పుడూ రాజకీయ ప్రకటనలు చేస్తూ తానున్నాననే ఉనికి చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, కాపు రిజర్వేషన్ అంశం ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ మీడియాను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అదే కోవలో తాజాగా జగన్ ఆస్థుల కేసుపై పిటీషన్ వేసి తెలంగాణ హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారు. 


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్థుల కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించి 2024లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలంటు తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు, హరిరామ జోగయ్యకు సంబంధమేంటని గట్టిగానే ప్రశ్నించింది. దాంతో కిమ్మనలేని న్యాయవాదులు వివరణకు గడువు అడిగి వెనక్కి వచ్చేశారు.


వాస్తవానికి ఈ పిల్‌ను అనుమతించేందుకే తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. వ్యక్తిగత కేసులపై పిల్ వేయడమేంటని ప్రశ్నించింది. పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు ఉంచింది. రిజిస్ట్రీ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉత్కల్, జస్టిస్ తుకారాం వాదనలు విన్నారు. విచారణ వేగవంతంపై సీబీఐను సంప్రదించకుండా నేరుగా కోర్టుకు ఎందుకొచ్చారని తెలంగాణ హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. పిటీషనర్ తరపు న్యాయవాదులు మాట్లాడకపోవడంతో ప్రచార ప్రయోజనం కోసం పిల్ దాఖలు చేశారా అని మండిపడింది తెలంగాణ హైకోర్టు. దాంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని న్యాయవాదులు వివరణ కోసం 2 వారాల గడువు కోరి వచ్చేశారు. 


Also read: Jagananna Vidya Kanuka: నేడే జగనన్న విద్యాకానుక పంపిణీ.. ఒక్కో విద్యార్థికి రూ.2,400 ఖర్చు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook