TDP Strategy in Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చ్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం..అందుకు తగ్గ వ్యూహాల్ని కూడా సిద్ధం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై పోరాడుతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించాల్సినవి మూడు అంశాలని తెలిపారు. 


అమరావతి, పోలవరం, వివేకానందరెడ్డి హత్యకేసు వంటి అంశాల్ని ప్రధానంగా చర్చించనున్నామని అచ్చెన్నాయుడు చెప్పారు. అమరావతి విషయంలో హైకోర్టు ఎన్ని అక్షింతలు వేసినా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు బుద్ది రావడం లేదని చెప్పారు. రాజధాని విషయంలో తెలుగుదేశం నిర్ణయమే సరైందని హైకోర్టులో తేలిందన్నారు. మూడేళ్లలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా రాలేదన్నారు. అసెంబ్లీలో ఈసారి మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు. వివిధ సందర్భాల్లో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాల్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. గత కొద్దిరోజులుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో తెలుగుదేశం పార్టీలో సందిగ్దత నెలకొంది. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు మినహా మిగిలినవారంతా అసెంబ్లీకు హాజరుకానున్నారని టీడీపీ స్పష్టం చేసింది. అదే సమయంలో గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. 


గత అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగతంగా దూషించి..అవమానపర్చారనే కారణంతో చంద్రబాబు సహా తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా సమావేశాల్ని బహిష్కరించారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకు హాజరవుతానని చంద్రబాబు శపధం చేశారు. అందుకే 7 నుంచి ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన సభ్యులంతా హాజరుకానున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును అవమానపర్చడం, అమరావతి, వివేకానందరెడ్డి హత్యకేసు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై అధికార పార్టీని ఇరుకునపెట్టాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది. 


Also read: AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, 48 గంటల్లో భారీ వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook