Balakrishna Comments: గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసే రకం..జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ ఫైర్..!
Balakrishna Comments: ఏపీలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను టీడీపీ శ్రేణులు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నేతలు మండిపడుతున్నారు.
Balakrishna Comments: ఏపీలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను టీడీపీ శ్రేణులు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నేతలు మండిపడుతున్నారు. తాజాగా సీఎం జగన్, వైసీపీ సర్కార్‌పై ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం గుడిని,గుడిలోని లింగాన్ని మింగేసే రకమని విమర్శించారు.
ఒక్క ఛాన్స్ అంటూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రజలంతా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. దేశమంటే మట్టి కాదోయే..దేశమంటే మనుషులోయ్ అన్న దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెమ్మసాని థియేటర్‌లో ఏడాదిపాటు రోజుకోక ఎన్టీఆర్ చిత్రం ఉచితంగా షో వేయనున్నారని తెలిపారు. ప్రతి నెలా వచ్చి సినీ కార్మికులకు అవార్డులు అందజేస్తామన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించి..తిరుగులేని మహానటుడిగా ఎన్టీఆర్ నిలిచారన్నారు బాలకృష్ణ. తెలుగువారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా..ముందుండే వారని చెప్పారు.
గతంలో కరువుతో ఇబ్బందిపడుతున్న సీమ ప్రజల కోసం జోలిపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దివిసీమ ఉప్పెన సమయంలోనూ ఎన్టీఆర్ సేవలు మరవలేనివన్నారు. తెలుగుజాతి, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడారని తెలిపారు. సమాజమే దేవాలయం..ప్రజలే దేవళ్లు అని ఎన్టీఆర్ నిరూపించారన్నారు. తెలుగువారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా గుర్తిండిపోతున్నారన్నారు బాలకృష్ణ.
Also read:Rahu Remedies: మీరు మద్యానికి, డ్రగ్స్ కు బానిస అవ్వడానికి రాహువే కారణం..! ఈ పరిహారాలు చేయండి
Also read:Turmeric On Face Benefits: పసుపును చర్మానికి అతిగా వినియోగిస్తున్నారా..అయితే ప్రమాదమే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook