Nara Lokesh Comments: ఏపీలో టీడీపీ పండుగ కన్నులపండువగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒంగోలు వేదికగా మహానాడు సాగుతోంది. ఇందులో పలు కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తున్నా వారికి ఈసారి టికెట్లు ఇవ్వకూడదని భావిస్తున్నామన్నారు. దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీ పండుగ మహానాడు సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలకు సుదీర్ఘకాలం పదవుల విధానం రద్దు చేయాలని తాను ప్రతిపాదన పెట్టానని చెప్పారు. ఈ విధానాన్ని తన నుంచే మొదలు పెట్టాలని అనుకుంటున్నానన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు పనిచేశానని..ఈసారి వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నారు లోకేష్. ఈ తరహానే పార్టీలో టూ ప్లస్ వన్‌ (2+1) విధానం రావాలని స్పష్టం చేశారు. 


రెండు లేదా మూడు పర్యాయాలు వరుసగా పదవిలో ఉన్న వారికి విరామం ఇవ్వాలన్నారు. ఆయా స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో పార్టీ సరైన అభ్యర్థులను తీసుకురావాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఓ క్లారిటీతో ఉన్నారని చెప్పారు. త్వరలో ఆ ప్రకటన రానుందని వెల్లడించారు. మహానాడు తర్వాత కీలక విషయాలను వెల్లడిస్తానన్నారు లోకేష్.


నారా లోకేష్‌ ప్రకటనతో ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఎక్కడ తమ పదువులు పోతాయోనని ఆందోళన చెందుతున్నారు. మహానాడులో దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతలు కలిసి ప్రతి చోట దీనిపైనే మంతనాలు జరుపుతున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Also read:Bad Breath: మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా..అయితే ఈ చిట్కాలను పాటించండి..!!


Also read:Honor Killing: తెలంగాణలో మరో పరువు హత్య..సినిమాను తలపించిన రియల్ సీన్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook