Honor Killing: తెలంగాణలో మరో పరువు హత్య..సినిమాను తలపించిన రియల్ సీన్..!

Honor Killing: అల్లరి నరేష్‌, సదా జంటగా నటించిన సినిమా ప్రాణం. ఈ సినిమాలో కులాంత వివాహం చేసుకున్నారని ఇద్దరిని గ్రామ పెద్దలు విడదీస్తారు. ఇప్పుడు అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రాణం సినిమాలో ప్రేమికులు ఇద్దరూ చనిపోతారు. ఐతే ఇక్కడ మాత్రం యువతిని తండ్రే హతమార్చాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 05:51 PM IST
  • తెలంగాణలో ప్రాణం సినిమా ఘటన
  • ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య
  • కలకలం రేపిన మరో పరువు హత్య
Honor Killing: తెలంగాణలో మరో పరువు హత్య..సినిమాను తలపించిన రియల్ సీన్..!

Honor Killing: అల్లరి నరేష్‌, సదా జంటగా నటించిన సినిమా ప్రాణం. ఈ సినిమాలో కులాంత వివాహం చేసుకున్నారని ఇద్దరిని గ్రామ పెద్దలు విడదీస్తారు. ఇప్పుడు అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రాణం సినిమాలో ప్రేమికులు ఇద్దరూ చనిపోతారు. ఐతే ఇక్కడ మాత్రం యువతిని తండ్రే హతమార్చాడు. 

తెలంగాణ రాష్ట్రం పరువు హత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. నాగరాజు,నీరజ్ పరువు హత్యలు మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. నడి రోడ్డుపై, అందరూ చూస్తుండగానే కన్న బిడ్డను అత్యంత దారుణంగా నరికేశాడో తండ్రి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నార్నూర్ మండలం నాగల్‌కొండకు చెందిన పవార్ రాజేశ్వరి.. అదే గ్రామానికి చెందిన షేక్ అలీం గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈక్రమంలో మూడు నెలల క్రితం పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. ఇటీవల దీనిపై పెద్ద సమక్షంలో పంచాయతీ జరిగింది. రాజేశ్వరిని, అలీంను విడదీస్తూ గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. ఐతే తనకు భర్త కావాలంటూ రాజేశ్వరి బీష్మించింది. తండ్రి దేవిదాస్‌తో గొడవకు దిగింది. ఘర్షణ తీవ్ర తరం కావడంతో కుటుంబ పరువు తీశావంటూ దేవిదాస్‌..ఆమెను నడి రోడ్డుపై కత్తితో దాడి చేశాడు. కూతురు గొంతు కోసి హత్య చేశాడు. 

అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. తన కుమార్తెను ఎవరో చంపేశారంటూ ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు..ఘటనాస్థలిని పరిశీలించారు. కేసును తండ్రి దేవిదాస్‌ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఐతే పోలీసులు విచారణలో నిజాలు బయటపడ్డాయి. యువతి తండ్రే హత్య చేసినట్లు గుర్తించారు. తల్లి సావిత్రి బాయి ఎదుటే హత్య చేసినట్లు విచారణలో తేలింది. కులాంత వివాహం చేసుకుందన్న కారణంగానే హత్య చేసినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:YS Jagan Davos Tour: దావోస్ వేదికగా ఏపీకు లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి బాటలో విశాఖ
Also read:Aryan Khan Case: క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు..ఆర్యన్‌కు అందుకే ఊరట లభించిందా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News