Chandrababu Comments: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయా..? ప్రభుత్వం ఏం చెబుతోంది..? ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలు ఏమంటున్నారు..? పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి..? ఇప్పుడు వీటిపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. తాజాగా వరుస హత్యలపై టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. హత్యల వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పల్నాడులో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య మృతదేహాన్ని ఎక్కడికి తరలించారని ప్రశ్నించారు. సొంత గ్రామంలో అంతిమ సంస్కారాలు చేసే అవకాశం ఇవ్వారా అని మండిపడ్డారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు హత్యకు గురైయ్యారని చంద్రబాబు చెప్పారు. వీటి వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని విమర్శించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. వీటిపై లోతైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు.


జల్లయ్య అంత్యక్రియలకు వెళ్తున్న టీడీపీ నేతలను అరెస్ట్‌ చేయడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. రక్షణ కల్పించలేని పోలీసులు అంత్యక్రియలకు వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం ఏంటన్నారు. జల్లయ్య కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అతడి కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. జల్లయ్య కుటుంబానికి టీడీపీ తరపున రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. చెక్కును మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు.


చంద్రబాబు, టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. హత్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగత, ఆర్థిక కారణాలతోనే హత్యలు జరిగి ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి సంస్కృతిని సీఎం జగన్ ఉపేక్షించరని అంటున్నారు. కొన్ని ఘటనలను చంద్రబాబు, టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు. పోలీసుల విచారణలో రాజకీయ హత్యలు లేవని తేలిందంటున్నారు.


Also read: Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ టెర్రర్..భారత్‌లోనూ తాజాగా కేసు నమోదు..!


Also read: Acham Naidu: ఏపీలో పది ఫలితాల వాయిదాపై రాజకీయ దుమారం..అచ్చెన్నాయుడు ఏమన్నారంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook