TDP-Janasena List: తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయ పార్టీలపై స్పష్టంగా కన్పిస్తోంది. సిట్టింగులకు సీట్లిచ్చి బీఆర్ఎస్ చేతులు కాల్చుకోవడంతో ఇక్కడి పార్టీలు అప్రమత్తమౌతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, పొత్తు సమీకరణాలతో త్యాగానికి సిద్ధం కావాలని టీడీపీ అదినేత చంద్రబాబు సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల తొలి జాబితా దాదాపుగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు సిద్ధమౌతున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలుండవచ్చనే సంకేతాల నేపధ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం అప్పుడే తొలి జాబితా దాదాపుగా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైన నేపద్యంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే విషయంలో దాదాపుగా స్పష్టత వస్తోంది. 50 అసెంబ్లీ, 5 లోక్‌సభ సీట్లను జనసేన ఆశిస్తుండగా, 30 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలిచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే టీడీపీ 45 మందితో తొలి జాబితా దాదాపుగా సిద్ధం చేసినట్టు సమాచారం. 


జనసేన కోరుకుంటున్న స్థానాల గురించి చంద్రబాబు సమాచారం సేకరిస్తున్నారు. పలు సర్వేల ద్వారా జనసేన కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ ఎక్కడ బలంగా ఉందనే వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉన్న నేపధ్యంలో అక్కడే ఆ పార్టీకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని తెలుగుదేశం భావిస్తోంది. అందుకే ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి టీడీపీ నేతలు త్యాగానికి సిద్ధం కావాలని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అదే సమయంలో పార్టీ అధికారంలో రావడం ముఖ్యమైనందున గెలుపు గుర్రాలకే టికెట్లు అని చంద్రబాబు స్పష్టం చేశారు. 


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖరారు చేసిన సీట్లు, జనసేను నుంచి అభ్యంతరం లేకుండా టీడీపీకు ప్రయోజనకరంగా ఉన్న 45 స్థానాలతో తెలుగుదేశం తొలి జాబితా దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి టీడీపీ తొలి జాబితా ప్రకటించవచ్చని సమాచారం. ఈ తొలి జాబితాలో ప్రస్తుతం టీడీపీ నుంచి ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. మరో 27 మందిని గెలుపు గుర్రాల్ని సిద్ధం చేసింది. 


జనసేనకు ఖరారైన స్థానాలు


పిఠాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, నర్శాపురం, ఆళ్లగడ్డ, తెనాలి, గాజువాక, తిరుపతి, కైకలూరు, అమలాపురం, రాజోలు, శ్రీకాకుళం, భీమిలి


రెండు పార్టీలు చర్చించుకుని ఉమ్మడి తొలి జాబితా విడుదల చేస్తే ప్రయోజనం ఉండవచ్చనే ఆలోచన కూడా చంద్రబాబుకు ఉందని తెలుస్తోంది. రెండు పార్టీల మద్య క్షేత్రస్తాయిలో సమన్వయం పెరిగేందుకు ఇది దోహదపడనుంది.


Also read: Uddanam Project: దశాబ్దాల సమస్యకు తెర, ఈ నెల 15న ఉద్ధానం ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook