Uddanam Project: దశాబ్దాల సమస్యకు తెర, ఈ నెల 15న ఉద్ధానం ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం జగన్

Uddanam Project: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. విషతుల్యమైన నీటి నుంచి అక్కడి ప్రజలకు విముక్తి లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 10, 2023, 07:11 AM IST
Uddanam Project: దశాబ్దాల సమస్యకు తెర, ఈ నెల 15న ఉద్ధానం ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం జగన్

Uddanam Project: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతం పేరు వింటే కిడ్నీ వ్యాధులు గుర్తొస్తాయి. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు వేధిస్తున్న ప్రధాన సమస్య ఇదే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎందరు నేతలు మారినా ఇక్కడి ప్రజల తలరాత మాత్రం మారలేదు. తరాలన్నీ కిడ్నీ వ్యాధులతోనే సతమతమౌతున్న పరిస్థితి, ఇప్పుడీ చిత్రం మారబోతోంది. 

ఉత్తరాంధ్రలోని ఉద్దానం ప్రాంతంలో నెలకొన్న కిడ్నీ సమస్య ఈనాటిది కాదు. ఇక్కడి భూగర్భంలోని విషతుల్యమైన నీరే ఇందుకు కారణం. ఉద్దానం ప్రాతంంలో దాదాపు సగం మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవాళ్లే. దశాబ్దాలుగా ఇదే వ్యాధితో బాదడుతున్నా, ఎందరికో విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా ఈ సమస్యపై ఫోకస్ చేసింది. తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొంది. ఉద్దానం ప్రాంతానికి రక్షిత మంచినీరు అందించేందుకు 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పధకం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఉద్దానం ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ వంశధార నది బ్యాక్ వాటర్ నుంచి మెలియాపుట్టి శుద్ధి కేంద్రానికి మంచి నీటిని పైపులైన్ ద్వారా తరలిస్తారు. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఇక్కడ్నించి 132 కిలోమీటర్ల పైపులైను ద్వారా ఉద్దానం చివరి ప్రాంతం ఇఛ్చాపురం వరకూ అందరికీ రక్షిత మంచి నీరు అందిస్తారు. 

ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పలాస నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రక్షిత మంచి నీరు అందుతుంది. కిడ్నీ వ్యాధులు నెమ్మదిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. అధికారంలో రాగానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ నెల 15న ప్రాజెక్టు ప్రారంభం కానుంది. 

Also read: Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు మళ్లీ వర్షసూచన, రానున్న 24 గంటల్లో వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News