Times Now Survey: ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్.. టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వేలో ఫ్యాన్‌దే హవా
Times Now ETG Survey Results: ఏపీలో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వైసీపీ 24-25 సీట్లతో క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8-10 స్థానాలు వస్తాయని తెలిపింది.
Times Now ETG Survey Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైఎస్సార్సీపీ హవానే కొనసాగుతుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. 'ETG రీసెర్చ్' చేసిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ వెల్లడించింది. వైసీపీ 50 శాతం ఓట్లు సాధిస్తుందని.. టీడీపీ 37 శాతం, జనసేన 10 శాతం, బీజేపీ ఒక శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ 24-25 సీట్లు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. టీడీపీ ఒక సీటు గెలవచ్చని పేర్కొంది. జనసేన, బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. అయితే ఈ సర్వేలను టీడీపీ-జనసేన నాయకులు ఖండిస్తున్నారు.
ఇక గత అక్టోబర్ నెలలో వెల్లడించిన సర్వేలో కంటే వైసీపీకి కాస్త ఓట్ల శాతం తగ్గింది. గత సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 51.10 శాతం ఓట్లు సాధించి 24-25 ఎంపీ సీట్లు సాధిస్తుందని తెలపగా.. ఇప్పుడు 50 శాతం ఓట్లు సాధిస్తుందని వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ 36.4 శాతం ఓట్లు సాధిస్తుందని గత సర్వేలో తేలగా.. ప్రస్తుత సర్వేలో 37 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. గత సర్వేలో జనసేనకు 10.1 శాతం ఓట్లు సాధిస్తుందని తేలగా.. ఈసారి 10 ఓట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ ఓటు బ్యాంక్‌లో పెద్దగా మార్పురాలేదు.
ఇక తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే.. ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయనే విషయంపై కూడా టైమ్స్ నౌ సంస్థ ఈటీజీ సర్వే చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ హవా లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని వెల్లడైంది. మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా.. కాంగ్రెస్ 8-10 స్థానాలు, బీఆర్ఎస్ 3-5 స్థానాలు, బీజేపీ 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 37 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 32 శాతం, బీజేపీ 24 శాతం ఓట్లు సాధిస్తాయని సర్వేలో తేలింది.
Also Read: Vijay Devarakonda: విజయ దేవరకొండ పై అసభ్యకర వార్తలు... ప్రచారపు వ్యక్తి అరెస్ట్
Also Read: Honey with Garlic: రోజూ పరగడుపున ఈ మిశ్రమం తీసుకుంటే మెరుపువేగంతో అధిక బరువు మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి