Tirumala Laddu Manchu Vishnu vs Prakash Raj: తిరుమల లడ్డూ వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుటికే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ గత ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీట్ పెరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే మత రాజకీయం మొదలైపోయింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ పెద్దల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. దీనిపై విచారించి నేరస్థులపై తగిన చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసరంగా భయాందోళనలు కల్పిస్తూ జాతీయ స్థాయిలో చర్చించేలా చేస్తున్నారు..ఇప్పటికే దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు అంటూ ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ప్రకాశ్ రాజ్‌పై రెచ్చిపోయారు. ప్రకాష్ రాజ్‌ను దూషిస్తూ ట్రోలింగ్ ప్రారంభించారు. ఈలోగా హఠాత్తుగా మంచు విష్ణు తెరపైకొచ్చాడు. మీ పరిధిలో మీరు ఉండండి అంటూ అవమానించేలా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. 


ప్రకాశ్ రాజ్ గారూ..దయచేసి మీరు మరీ అంత నిరుత్సాహపడకండి, తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు నాలాంటి కోట్లాది మంది హిందూవుల నమ్మకానికి ప్రతీక. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ధర్మ పరిరక్షణకై తగిన చర్యలు తీసుకుంటారు. మీ పరిధిలో మీరు ఉండండి అని పోస్ట్ చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. మంచు విష్ణు ఈ తరహాలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ సమర్ధిస్తూ మాట్లాడటంపై ఆశ్చర్యం కలుగుతోంది. అదే సమయంలో సినీ పరిశ్రమలో లడ్డూ వివాదం రేపుతున్న వర్గ విబేధాలకు దర్పణం పడుతోంది. అయితే మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో రిప్లై కూడా ఇచ్చే పడేశారు.



ఓకే శివయ్యా..నా దృష్టికోణం నాకుంది. అదే విధంగా మీకు కూడా ఉంటుంది. గుర్తు పెట్టుకోండి జస్ట్ ఆస్కింగ్ అంటూ రియాక్ట్ అయ్యారు. ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చేశారు. మా ఎన్నికల సమయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న ఇద్దరూ తిరిగి ఇప్పుడు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలవడం విశేషం. 


Also read: OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 8 సినిమాలు , 2 వెబ్‌సిరీస్‌లు, పండగే పండగ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.