OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 8 సినిమాలు , 2 వెబ్‌సిరీస్‌లు, పండగే పండగ

OTT Movies this Week in Telugu: ప్రతి వారం విభిన్న రకాల కంటెంట్, వివిధ భాషలతో అలరిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈవారం కూడా సందడి చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీల్లో చడీచప్పుడు లేకుండా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేశాయి. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 21, 2024, 05:36 PM IST
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 8 సినిమాలు , 2 వెబ్‌సిరీస్‌లు, పండగే పండగ

OTT Movies this Week in Telugu: ఎప్పటిలానే ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంటే మరికొన్ని స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఏకంగా 8 సినిమాలు, రెండు వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల కోసం సిద్ధమయ్యాయి. కొన్ని ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్నాయి.

ఈ వారం విడుదలైన సినిమాల్లో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి కామెడీ ఎంటర్‌టైనర్. ఓటీటీలో కూడా మంచి స్పందన అందుకుంటోంది. ఇక రాజ్ తరుణ్ నటించిన సినిమా తిరగబడరా సామి కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అంత హిట్ కాకపోయినా ఫరవాలేదన్పిస్తోంది. 

ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ తెలుగు వెబ్‌సిరీస్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మంచి రెస్పాన్ లభిస్తోంది. తమిళ వెబ్‌సిరీస్ తలై వేట్టాయమపాళ్యం సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.  మళయాలం నుంచి తెలుగులో డబ్ అయిన బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్ సినిమా సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

నెట్‌‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే తంగలాన్ సినిమా మంచి రెస్పాన్స్ పొందుతోంది. ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 21 నుంచి హిందీ రియాల్టీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లీషు నుంచి తెలుగులో డహబ్ అయిన పోస్ట్ ఎక్స్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టాలీవుడ్ నటుడు నాని నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం ఈ వారంలోనే అంటే సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

ఇక అజయ్ ఘోష్ నటించిన సురాపానం థ్రిల్లర్ సినిమా, అనంత్ వర్ధన్ తెరకెక్కించిన సోపాతులు, నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన పేకమేడలు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. 

Also read: Diabetes Control Tips: డయాబెటిస్ అదుపులో ఉంచే సులభమైన ఆద్భుతమైన చిట్కాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News