Karunakar reddy hot comments on laddu controvercy in tirupati: తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే దీనిపై దేశంలోనే కాకుండా.. ప్రపంచ స్థాయిలో కూడా భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయి మీడియాలు కూడా  ఈ వివాదాన్ని కవర్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు నాయుడు.. ఇటీవల కూటమి ఏర్పడి వందరోజుల పాలనపై ప్రొగ్రెస్ నేపథ్యంలో జరిగిన సమావేశంలో షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనెలను కలిపారని, లడ్డు తయారీకీ నాణ్యతలేని పదార్థాలను ఉపయోగించారని కూడా బాంబు పేల్చారు. దీంతో ఇది కాస్త ఏపీలో సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఏకంగా సీఎం చంద్రబాబు.. ఈ ఆరోపణలు చేయడం, దీనికి బలం చేకూర్చేలా.. పలు ల్యాబ్ రిపోర్ట్ లను సైతం బైటపెట్టారు. దీంతో ఇది కాస్త ఏకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. దీనిపై కేంద్రం కూడా జోక్యం చేసుకుంది. లడ్డు వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని కూడా కొరింది. ఇక చంద్రబాబు దీనిపై ఐజీస్థాయి అధికారితో సిట్ ను సైతం ఏర్పాటు చేశారు.


తిరుమలలో జరిగిన అపచారానికి డిప్యూటీ సీఎం 11 రోజుల పాటు.. ప్రాయిశ్చిత్త దీక్షను ప్రారంభించారు. అంతేకాకుండా.. తిరుమలలో శాంతి యాగంలను కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా.. దీనిపై కూటమి.. గత ప్రభుత్వాన్ని గట్టిగానే ఆరోపణలు చేసింది.


తిరుమల లడ్డులో ఎలాంటి తప్పిదాలు చేయలేదని, ప్రమాణం చేస్తారా.. అంటూ సవాళ్లు సైతం విసురుకున్నారు. మాజీ  సీఎం జగన్ సైతం మీడియా సమావేశంలో ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ అంటూ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో మాజీ టీటీడీ చైర్మన్ .. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల ఆలయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.


పూర్తి వివరాలు..


తిరుమలలో నెయ్యి కల్తీలు చేశామని చేసిన ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి స్వామి ఆలయంలో ఆర్తీ కర్పురం దివ్వెలను చేతిలో పట్టుకుని మరీ ప్రమాణం చేశారు. తాను.. మూడు సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేశానన్నారు. శ్రీవారి ఆలయంలో కొంత మంది నీచమైన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నీ అన్న ప్రసాదాలలో.. అత్యంత పవిత్రమైన లడ్డు కళంకితమైందని.. కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు.


Read more: Viral video: బాప్ రే.. కదులుతున్న ట్రైన్ లో పదడుగుల పాము హల్ చల్.. బెదిరిపోయిన ప్రయాణికులు.. ఎక్కడంటే..?


నేను తప్పుచేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలని.. ఏ చర్యలకైన సిద్ధమేనని కూడా సవాల్ విసిరారు. దీంతో  ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.