కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ దర్శనాలు తిరిగి ప్రారంభమమయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనలు సడలింపుతో తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి దర్శనాలు ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి. మార్చి 20 తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు నేటి ఉదయం తెరుచుకున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత శ్రీవారి ఆలయం తెరుచుకుంటున్న నేపథ్యంలో తిరుమలను పలు రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కిటకిట


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామాజిక దూరం పాటించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ఉద్యోగులతో ట్రయిల్ రన్ ప్రారంభించారు. నేడు, రేపు శ్రీవారి ఆలయం ఉద్యోగులు, సిబ్బంది, జూన్ 10వ తేదీన స్థానికులకు, జూన్ 11 నుంచి రెగ్యూలర్‌గా భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించేందుకే ఏర్పాట్లు పూర్తయ్యాయి.



నిబంధనలకు లోబడి 65ఏళ్లు పైబడిన వృద్ధులు, 10ఏళ్ల లోపు చిన్నారులకు ఆలయ ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేశారు. గంటకు 500 మంది చొప్పున ఈరోజు 5600 టిక్కెట్లు టీటీడీ ఉద్యోగులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్