TTD Temple in Kashmir: భూతల స్వర్గంలో శ్రీవారు కొలువుదీరనున్నారు. కశ్మీర్ గడ్డపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం రానుంది. రానున్న 18 నెలల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తికానుందని టీటీడీ ఛైర్మన్ ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మితం కానున్నాయి. మరీ ముఖ్యంగా భూతల స్వర్గమైన కశ్మీర్‌లో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం ఇప్పటికే (Tirumala Temple in Kashmir) శంకుస్థాపన పూర్తయింది. త్వరలో అంటే 18 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (Yv Subbareddy) తెలిపారు. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో వారణాసి, ముంబైలలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 5 వందల శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామన్నారు. టీటీడీకు (TTD) సంబంధించి గత రెండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎల్1 దర్శనాల్ని రద్దు చేశామని చెప్పారు. 


తిరుమల(Tirumala) లో ప్లాస్టిక్ బ్యాన్ చేశామని..కరోనా సమయంలో ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహించలేమన్నారు. ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామన్నారు. 


Also read: AP Vaccination: ఏపీలో రేపు రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook