Tirumala Updates: ఫిబ్రవరి 15 తర్వాత శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్
Tirumala Sarva Darshan Tickets: కొవిడ్ కేసులు మరింత తగ్గితే ఈ నెల 15 తర్వాత భక్తులకు సర్వదర్శనం టోకెన్స్ జారీ చేయనుంది టీటీడీ. అలాగే టీటీడీ ఫేక్ వెబ్‌సైట్స్‌ను నిఘా పెంచామన్న ఈఓ జవహర్ రెడ్డి... తిరుమలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిపారు.
TTD Darshanam Tokens: కరోనా కేసులు తగ్గితే ఫిబ్రవరి 15 తర్వాత భక్తులకు సర్వదర్శనం టోకెన్స్ జారీ చేస్తామంటూ టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ (TTD) ఉన్నతాధికారులతో తాజాగా ఈఓ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఇక కొవిడ్ పూర్తిగా తగ్గితే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు కూడా అనుమతి ఇస్తామంటూ టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి (Jawahar Reddy) వెల్లడించారు. ఇక టీటీడీ దర్శనానికి సంబంధించి నకిలీ టికెట్స్ అమ్మేటటువంటి ఫేక్ వెబ్‌సైట్స్‌ను అన్నింటినీ ఎప్పటికప్పుడూ గుర్తిస్తూ శాశ్వతంగా తొలగిస్తున్నామంటూ ఆయన తెలిపారు.
నకిలీ వెబ్‌సైట్స్‌ను (Fake Websites) కట్టడి చేసేందుకు టీటీడీ సైబర్ డిపార్ట్‌మెంట్ కృషి చేస్తోందని చెప్పారు. భక్తులు కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాలని సూచించారు. తిరుమలలో డిజాస్టర్ మేనేజ్మెంట్‌పై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రమాదాల్ని ముందుస్తుగానే గుర్తించేటటువంటి టెక్నాలజీని కూడా తీసుకురానున్నట్లు చెప్పారు.
అలాగే తిరుమలలో (Tirumala) ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక ఫిబ్రవరి 16వ తేదీన అంజనాద్రి డెవలప్‌మెంట్ పనులకు సంబంధించిన భూమి పూజ చేపడుతున్నట్లు టీటీడీ (TTD) ఈఓ జవహర్ రెడ్డి చెప్పారు.
Also Read: MLA Roja Resignation: వైసీపీలో పదవుల చిచ్చు.. రాజీమానాకి సిద్దమైన ఎమ్మెల్యే రోజా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook