Tirupati Ruia Hospital: తీవ్ర గాయాలతో వచ్చిన ఓ పేషెంట్‌ను ఆసుత్రిలో చేర్చుకునేందుకు అక్కడి వైద్యులు నిరాకరించారు. సర్జన్లు లేని కారణంగా ఆపరేషన్ చేయలేమని చెప్పి పేషెంట్‌ను ఆసుపత్రి నుంచి తిప్పి పంపించారు. అప్పటికే పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన అతని కుటుంబ సభ్యులు... ఇక చేసేది లేక పేషెంట్‌ను చెన్నైకి తరలించారు. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి మేకలను మేపేందుకు వెళ్లిన క్రమంలో మేత కోసం ఓ చెట్టెక్కాడు. చెట్టుపై ఆకులు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.


కానీ 3 గంటలు గడిచినా అంబులెన్స్ రాలేదు. దీంతో సొంత ఖర్చులతో అతన్ని మొదట తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేర్చుకోమని చెప్పడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంకటేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ రుయా ఆసుపత్రిలో ఆర్థో వైద్యులు, సీటీ సర్జన్లు, న్యూరో సర్జన్లు లేరని చెప్పి అతన్ని తిప్పి పంపించారు. దీంతో వెంకటేశ్ కుటుంబ సభ్యులు అతన్ని చెన్నైకి తరలించి.. అక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. 


ఈ ఘటనపై రుయా సూపరింటెండెంట్ మాట్లాడుతూ న్యూరో, సీటీ సర్జన్ల పర్యవేక్షణ లేకుండా ఆర్థో సర్జరీలు చేయలేమన్నారు. అందుకే వెంకటేశ్‌ను ఆసుపత్రిలో చేర్చుకోలేదని అన్నారు. 


కాగా, కొద్ది రోజుల క్రితం ఇదే తిరుపతి రుయా ఆసుపత్రిలో అమానీయ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  108 అంబులెన్స్ సిబ్బంది నిరాకరించడంతో బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని తరలించాడు ఓ తండ్రి. దాదాపు 90కి.మీ బైక్‌పై మృతదేహంతో ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇలాంటి ఘటనలతో తిరుపతి రుయా ఆసుపత్రిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


Also Read:Mehabooba Song Video: కేజీఎఫ్ 2 రొమాంటిక్ సాంగ్ మెహబూబా వీడియో వచ్చేసింది!


Also Read:KGF 2 Records & OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2 మరో రికార్డు.. ఓటీటీలో ఎప్పుడో తెలుసా..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Apple Link - https://apple.co/3loQYe 


Android Link - https://bit.ly/3hDyh4G


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.