విజయవాడ: ఎన్నికల సమయం ఆసన్నమైనందున ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో APPSC నోటిఫికేషన్లతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉగ్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇటీవల ఆర్థికశాఖ గ్రూప్ -1, గ్రూప్ 2, గ్రూప్ -3కి సంబంధించిన దాదాపు మూడు వేల పోస్టుల భర్తీకి సముఖత చూపింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కేబినెట్ గనుక ఉగ్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే  ప్రభుత్వ ఉగ్యోగాల నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమనం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ  కేబినెట్ భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.


‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చిన సీఎం చంద్రబాబు.. ఈ రోజు ఏపీపీఎస్సీపై నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత ఏర్పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.