Why Manchu Vishnu away CM Jagan Meet: తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌తో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సమావేశమైన విషయం తెలిసిందే. సీఎంను కలిసిన వారిలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌. నారాయణమూర్తి, ఆలీ, పోసాని కృష్ణ మురళీ, నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వీరంతా సీఎం జగన్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యాక... మీడియా ముందుకు వచ్చి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలు తమను ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయంటూ సీఎంను కలిసి ప్రముఖుల్లో చాలా మంది చెప్పుకొచ్చారు. ఏపీలో సినిమా టికెట్‌ రేట్స్ ఇష్యూకు శుభం కార్డు పడినట్లుగా తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ భేటీకి మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ వెళ్లపోకపోవడం వల్ల అందరూ ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. సీఎంను కలిసిన సినీ ప్రముఖుల్లో మంచు ఫ్యామిలీ నుంచి సీనియర్ నటుడు అయిన మోహన్ బాబుగానీ లేదా "మా" అధ్యక్షుడు మంచు విష్ణుగానీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.


ఇటీవల మోహన్ బాబు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి ముందుకు వచ్చి మాట్లాడతానన్నారు. అలాంటి సీనియర్‌‌ నటుడు సీఎం జగన్‌ను కలిసిన సినీ ప్రముఖుల్లో లేకపోవడం ఏమిటని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నదే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి.. అలాంటి "మా"కు అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు సీఎంను కలిసిన ప్రముఖుల్లో లేకపోవడం ఏంటి అని పలువురు పెదవి విరుస్తున్నారు. 


సరే మంచు విష్ణుకు తాజా సీఎం భేటీకి ఆహ్వానం రాకపోయిండొచ్చు.. మరి సీనియర్‌‌ నటుడు మోహన్‌ బాబును ఎందుకు పక్కకు పెట్టారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఇక చిరంజీవి వెళ్లి సీఎం జగన్‌ను కలవడం అనేది మెగాస్టార్‌‌ వ్యక్తిగతం.. దానికి అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ తాజాగా మంచు విష్ణు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంచు విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు చిరంజీవికి ఏమైనా బాధ కలింగిచాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే సీనియర్ నటుడు అయిన మోహన్ బాబు, మంచు విష్ణును.. చిరంజీవి కలుపకపోలేదనే అనుమానాలను సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలు కారణాల వల్ల కావాలనే తాజాగా సీఎం జగన్‌తో జరిగిన భేటీలో మంచు ఫ్యామిలీని దూరం పెట్టేశారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే మంచు ఫ్యామిలీని ఈ భేటీకి పిలవలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


Also Read: AP Inter and Tenth Exams: ఏపీ ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నించంటే


Also Read: Pushpa Makeover Video: అల్లు అర్జున్.. పుష్పరాజ్ గా మారిన ట్రాన్స్‌ఫార్మ్‌ వీడియోను చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook